కరోనా ఎఫెక్ట్: కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయం మూసివేత

కరోనా ఎఫెక్ట్: కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయం మూసివేత

జగిత్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానం శనివారం అధికారులు మూసివేశారు. 25 నుండి 30 వరకు జరిగే హనుమాన్ చిన్న జయంతి ఉత్సవాలకు భక్తులు భారీ సంఖ్యలో వచ్చే అవకాశం ఉంది. దీంతోకరోనా వైరస్ వ్యాప్తి చెందే అవకాశముంది. దీని దృష్ట్యా ఆలయాధికారులు ముందస్తు జాగ్రత్తల్లో భాగంగా ఆలయాన్ని మూసివేశారు. శనివారం నుండి 30వ తారీఖు వరకు ఆలయం మూసి ఉంటుందని తెలిపారు. అంతరాలయంలో పూజా కార్యక్రమాలు యధావిధిగా కొనసాగుతాయని.. భక్తులు గాని, హనుమాన్ దీక్ష పరులు గాని గుట్ట పైకి రావద్దని సూచించారు.