వెల్‌‌‌‌‌‌‌‌నెస్ సెంటర్లలో.. ఇక సూపర్ స్పెషాలిటీ వైద్యం : మంత్రి దామోదర రాజనర్సింహ

వెల్‌‌‌‌‌‌‌‌నెస్ సెంటర్లలో.. ఇక సూపర్ స్పెషాలిటీ వైద్యం : మంత్రి దామోదర రాజనర్సింహ
  • ఖైరతాబాద్, కూకట్​పల్లిలో కార్డియాలజీ, న్యూరాలజీ, నెఫ్రాలజీ సేవలు
  • జిల్లాల్లోనూ జనరల్ సర్జరీ, సైకియాట్రీ, డెర్మటాలజీ సేవలు
  • నిమ్స్‌‌‌‌‌‌‌‌ పరిధిలోకి సిటీ సెంటర్లు.. డీఎంఈ కిందకు జిల్లా కేంద్రాలు
  • అధికారులకు మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశం

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులు, జర్నలిస్టులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఈహెచ్‌‌‌‌‌‌‌‌ఎస్, జేహెచ్ఎస్ వెల్‌‌‌‌‌‌‌‌ నెస్ సెంటర్లలో ఇకపై కార్పొరేట్ స్థాయి సూపర్ స్పెషాలిటీ వైద్యాన్ని అందించాలని మంత్రి దామోదర రాజనర్సింహ అధికారులను ఆదేశించారు. 

ఇప్పటి వరకు జ్వరం, జలుబు వంటి చికిత్సలకే పరిమితమైన ఈ సెంటర్లలో.. ఇక నుంచి గుండె, కిడ్నీ, న్యూరాలజీ సంబంధిత జబ్బులకు కూడా ట్రీట్‌‌‌‌‌‌‌‌మెంట్ లభించనుంది. ఈ మేరకు మంత్రి దామోదర రాజనర్సింహ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. శుక్రవారం ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ఆఫీసులో జరిగిన రివ్యూ మీటింగ్​లో ఈమేరకు నిర్ణయం తీసుకున్నారు.

నిమ్స్, డీఎంఈ చేతికి వెల్​నెస్ పగ్గాలు 

రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 12 వెల్‌‌‌‌‌‌‌‌ నెస్ సెంటర్ల నిర్వహణను మరింత సమర్థవంతంగా మార్చేందుకు ప్రభుత్వం కీలక మార్పులు చేసింది. హైదరాబాద్‌‌‌‌‌‌‌‌ లోని ఖైరతాబాద్, కూకట్‌‌‌‌‌‌‌‌ పల్లి వెల్‌‌‌‌‌‌‌‌ నెస్ సెంటర్ల నిర్వహణ బాధ్యతలను నిమ్స్‌‌‌‌‌‌‌‌ కు అప్పగించింది. దీంతో నిమ్స్ స్పెషలిస్ట్ డాక్టర్లు ఇక్కడ సేవలు అందించనున్నారు. 

మిగిలిన 10 జిల్లాల్లోని వెల్‌‌‌‌‌‌‌‌ నెస్ సెంటర్ల నిర్వహణ బాధ్యతలను మెడికల్ ఎడ్యుకేషన్‌‌‌‌‌‌‌‌ డిపార్ట్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌ (డీఎంఈ) పర్యవేక్షించనుంది. ఆయా జిల్లాల్లోని ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రొఫెసర్లు, డాక్టర్లు ఇక్కడ సేవలు అందిస్తారు. కాగా, వెల్‌‌‌‌‌‌‌‌ నెస్ సెంటర్లలో మందుల కొరత ఉండకూడదని మంత్రి దామోదర రాజనర్సింహ అధికారులను హెచ్చరించారు. అన్ని రకాల మందులను ఫుల్ స్టాక్ ఉంచుకోవాలని సూచించారు. 

అదనంగా అందుబాటులోకి రానున్న స్పెషాలిటీ సేవలు

g ఖైరతాబాద్: గుండె (కార్డియాలజీ), కిడ్నీ (నెఫ్రాలజీ), నరాలు (న్యూరాలజీ), చిన్నపిల్లల వైద్యం (పీడియాట్రిక్స్), ఊపిరితిత్తులు (పల్మోనాలజీ), ఫిజియోథెరపీ.
g కూకట్‌‌‌‌‌‌‌‌పల్లి: కార్డియాలజీ, న్యూరాలజీ, ఆర్థోపెడిక్, ఫిజియోథెరపీ.
g వనస్థలిపురం: జనరల్ మెడిసిన్, ఆర్థో, గైనకాలజీ, చర్మవ్యాధులు (డెర్మటాలజీ), పల్మోనాలజీ, ఈఎన్‌‌‌‌‌‌‌‌టీ, పీడియాట్రిక్స్, సైకియాట్రీ.
g వరంగల్, ఖమ్మం, మహబూబ్‌‌‌‌‌‌‌‌నగర్, సిద్దిపేట: ఈ నాలుగు చోట్ల జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, గైనకాలజీ, ఆర్థోపెడిక్స్, ఈఎన్‌‌‌‌‌‌‌‌టీ, సైకియాట్రీ, డెర్మటాలజీ సేవలు కొత్తగా అందించనున్నారు. వరంగల్‌‌‌‌‌‌‌‌లో అదనంగా పీడియాట్రిక్స్ సేవలు  కూడా ఉంటాయి.
g సంగారెడ్డి: జనరల్ సర్జరీ, పీడియాట్రిక్స్, గైనకాలజీ, కంటి వైద్యం(ఆఫ్తాల్మాలజీ), ఈఎన్‌‌‌‌‌‌‌‌టీ.
g ఆదిలాబాద్: జనరల్ సర్జరీ, ఆర్థో, గైనకాలజీ, కంటి వైద్యం, చర్మవ్యాధులు.
g నిజామాబాద్: ఆర్థో, గైనకాలజీ, ఈఎన్‌‌‌‌‌‌‌‌టీ, కంటి వైద్యం, చర్మవ్యాధులు, జనరల్ సర్జరీ.
g కరీంనగర్, నల్గొండ: జనరల్ మెడిసిన్, ఆర్థోపెడిక్స్, డెర్మటాలజీ.