హైదరాబాద్, వెలుగు: సౌదీ అరేబియాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాద బాధితులకు తెలంగాణ ప్రభుత్వం అండగా నిలిచింది. తీవ్ర విషాదంలో మునిగిపోయిన కుటుంబాలకు భరోసా కల్పిస్తూ సీఎం కీలక నిర్ణయం తీసుకున్నారు. బాధితులకు ఎక్స్‌గ్రేషియా చెల్లించేందుకు, ఇతర సహాయక చర్యల కోసం ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్) నుంచి రూ.3.07 మంజూరు చేశారు. నవంబర్ 17న సౌదీ అరేబియాలోని మక్కా–మదీనా మధ్య అల్ ముఫ్రిహత్ ప్రాంతంలో జరిగిన బస్సు ప్రమాదం విషాదాన్ని మిగిల్చింది.
దీనిపై తక్షణం స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం.. మైనారిటీ సంక్షేమ శాఖ ద్వారా (జీవో నం.125) నిధుల మంజూరుకు చర్యలు చేపట్టింది. తాజాగా సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి విడుదల చేసిన రూ.3.07 కోట్లను ఎక్స్‌గ్రేషియాగా అందించనున్నారు. ఈ మొత్తాన్ని తెలంగాణ హజ్ కమిటీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఖాతా (సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఫతేమైదాన్ బ్రాంచ్)లో జమ చేయాలని సీఎం ఓఎస్‌డీ వేముల శ్రీనివాసులు సంబంధిత అధికారులను ఆదేశించారు.
