- కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్
కామారెడ్డిటౌన్, వెలుగు : ఉద్యోగ, ఉపాధ్యాయ, నాలుగో తరగతి ఉద్యోగులతోపాటు ఎన్నికల సిబ్బంది సహకారంతో పంచాయతీ ఎన్నికలను విజయవంతంగా నిర్వహించామని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ పేర్కొన్నారు. శుక్రవారం టీఎన్జీవో జిల్లా ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలెక్టర్‌ను కలిసి సన్మానించారు. ఉద్యోగుల సమస్యలను కూడా కలెక్టర్ దృష్టికి తీసుకురాగా సానుకూలంగా స్పందించారు.
టీఎన్జీవో జిల్లా ప్రెసిడెంట్ నరాల వెంకట్‌రెడ్డి, సెక్రటరీ ముల్క నాగరాజు, జిల్లా కేంద్ర బాధ్యులు శివకుమార్, వైస్ ప్రెసిడెంట్ రాజ్యలక్ష్మి, సంయుక్త కార్యదర్శి రమణకుమార్, పబ్లిసిటీ సెక్రటరీ రాజ్‌కుమార్, ప్రతినిధులు మహిపాల్, అల్లాడి రమేశ్, అనుదీప్‌రెడ్డి, నరేశ్, పంచాయతీ సెక్రటరీలు ఉన్నారు.
సీపీవో ఆఫీసులో డిప్యూటీ ఎస్‌వోగా పని చేస్తూ ఎస్‌వోగా పదోన్నతి పొందిన, టీఎన్జీవో జిల్లా వైస్ ప్రెసిడెంట్ బి.లక్ష్మణ్‌ను శుక్రవారం టీఎన్జీవో జిల్లా ప్రతినిధులు సన్మానించారు. జిల్లా ప్రెసిడెంట్ నరాల వెంకట్‌రెడ్డి, సెక్రటరీ నాగరాజు, ప్రతినిధులు పాల్గొన్నారు.
