కామారెడ్డిటౌన్, వెలుగు : కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ కామారెడ్డి కలెక్టరేట్ ఎదుట శుక్రవారం తెలంగాణ మెడికల్ సెల్స్ అండ్ రిప్రజెంటివ్స్ యూనియన్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. సీఐటీయూ జిల్లా ప్రెసిడెంట్ కె.చంద్రశేఖర్ మాట్లాడుతూ ఎస్పీపీ యాక్ట్ 1976 చట్టాన్ని పునరుద్దరించాలన్నారు.
4 కొత్త కార్మిక చట్టాలతో కార్మికవర్గానికి, మెడికల్ రిప్రజెంటివ్స్ అండ్ సెల్స్ ప్రతినిధులకు తీవ్ర అన్యాయం జరుగుతుందన్నారు. యూనియన్ ఏర్పాటు చేసుకునే హక్కును, న్యాయ పరమైన సమస్యల పరిష్కారం కోసం సమ్మె చేసే హక్కును కూడా కాలరాసేలా చట్టాలు ఉన్నాయన్నారు. సీఐటీయూ జిల్లా సెక్రటరీ ముదాం అరుణ్, యూనియన్ జిల్లా ప్రెసిడెంట్ రవీంద్రచారి, ప్రతినిధులు మహేందర్‌రెడ్డి, ప్రేమ్‌కుమార్, సంతోష్, జన్రాజ్ తదితరులు పాల్గొన్నారు.
