యాదాద్రిలో కేసీఆర్ ప్రత్యేక పూజలు

 యాదాద్రిలో కేసీఆర్ ప్రత్యేక పూజలు

యాదాద్రి భువనగిరి: ముఖ్యమంత్రి కేసీఆర్ యాదాద్రి నరసింహున్ని దర్శించుకున్నారు. ఆలయంలో సతీ సమేతంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. యాదాద్రి రామలింగేశ్వర స్వామి ఆలయంలో మహా కుంభాభిషేకం ఉత్సవాలలో పాల్గొనేందుకు కేసీఆర్ యాదాద్రికి వచ్చారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కు మంత్రులు జగదీష్ రెడ్డి,  ఇంద్రకరణ్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్, విప్, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత, జడ్పీ చైర్మన్ సందీప్ రెడ్డి,  సీఎంవో భూపాల్ రెడ్డి తదితరులు ఘనంగా స్వాగతం పలికారు. 
పూర్ణకుంభంతో స్వాగతం
యాదాద్రి ప్రధాన ఆలయానికి చేరుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్ దంపతులకు అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. దేవాదాయ శాఖ కమిషనర్ అనిల్ కుమార్, వైటీడీఏ వైస్ ఛైర్మన్ కిషన్ రావు, ప్రధానార్చకులు నల్లందిగల్ నరసింహ చార్యులు, దేవస్థానం ఈవో గీతా రెడ్డి తదితరులు కేసీఆర్ వెంట ఉండి ప్రత్యేక పూజలు చేయించారు. ప్రధాన ఆలయం లో స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించిన ముఖ్యమంత్రి కేసీఆర్ దంపతులు గుట్టపైన  శివాలయం లో నిర్వహిస్తున్న మహాపూర్ణాహుతి,  మహా కుంభాభిషేకం పూజల్లో పాల్గొన్నారు. 
వైభవంగా కుంభాభిషేకం ఉత్సవాలు
యాదాద్రి రామలింగేశ్వర స్వామి ఆలయంలో మహా కుంభాభిషేకం ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఇవాళ  ఆరో రోజు సందర్భంగా ఉదయం 10.25 గంటలకు ధనిష్టా నక్షత్ర యుక్త మిథున లగ్న పుష్కరాంశ మాధవానంద సరస్వతి చేతుల మీదుగా పటిక లింగ ప్రతిష్టాపన ప్రాణ ప్రతిష్ట ప్రతిష్ట హోమం నిర్వహించారు. ఉత్సవాలలో రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి, ప్రభుత్వ విప్ గొంగిడి సునీత మహేందర్‌రెడ్డి పాల్గొన్నారు. వేద పండితులు, పురోహితులు. అర్చకులు రుత్విక్ యాగ్నిక బృందం పాల్గొని కుంభాభిషేకం ఉత్సవాలు జరిపించారు. 

 

 

ఇవి కూడా చదవండి

టీఆర్ఎస్ తో పీకే టీం..మాణిక్కం ఠాగూర్ ఆసక్తికర ట్వీట్

12 రాష్ట్రాల్లో పెరుగుతున్న కరోనా ఉధృతి

ఎల్ఐసీలో 3.5% వాటా అమ్మకానికి ఓకే