
- శత జయంతి సందర్భంగా సీఎం కేసీఆర్ నిర్ణయం
హైదరాబాద్, వెలుగు: స్వాతంత్ర్య సమర యోధుడు, సీనియర్ రాజకీయ నేత చెన్నమనేని రాజేశ్వర్ రావు శత జయంతి సందర్భంగా (ఆగస్టు 31), ఆయన చేసిన సామాజిక సేవకు గుర్తుగా కాళేAశ్వరం ప్రాజెక్టులోని ప్యాకేజీ 9కి (మల్కపేట రిజ ర్వాయర్, దాని పరిధిలోని కాల్వలు, మిడ్ మానేర్ నుంచి అప్పర్ మానేర్ దాకా) ‘‘చెన్నమనేని రాజేశ్వర్ రావు’’ పేరు పెడు తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయం పై ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్భంగా సీఎం మాట్లాడు తూ.. ‘‘నిరంతరం ప్రజలకోసం పోరాడిన గొప్పనేత చెన్నమనేని రాజేశ్వర్ రావు. రైతుల కోసం ఆనాటి కాలంలోనే వరద కాల్వలు, ఎత్తిపోతల పథకాల కోసం ఉద్యమించిన చరిత్ర ఆయనది’’ అని అన్నారు. కాగా, తనను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన సలహాదారుగా నియమించినం దుకు వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్ బాబు బుధవారం సీఎం కేసీఆర్ను కలిసి ధన్యవాదాలు తెలిపారు.