
ఎల్లుండి ఢిల్లీ వెళ్లనున్నారు ముఖ్యమంత్రి కేసీఆర్. సెప్టెంబర్ 2న ఢిల్లీలో TRS పార్టీ ఆఫీస్ కు భూమిపూజ చేయనున్నారు కేసీఆర్. ఈ కార్యక్రమానికి హాజరు కావాలని ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎమ్మెల్సీలు, టీఆర్ఎస్ కార్యవర్గ సభ్యులకు క్యాంప్ ఆఫీస్ నుంచి ఫోన్లు వెళ్లాయి. ఢిల్లీలోని వసంత్ విహార్ మెట్రో స్టేషన్ పక్కన TRS ఆఫీస్ కోసం 1300 గజాల స్థలం కేటాయించింది కేంద్ర ప్రభుత్వం. భూమి పూజ కార్యక్రమానికి పెద్దయెత్తున టీఆర్ఎస్ నేతలు హాజరు కానున్నారు. కార్యక్రమాలు పూర్తి చేసుకున్న తర్వాత సెప్టెంబర్ 3న మధ్యాహ్నం హైదరాబాద్ తిరిగిరానున్నారు కేసీఆర్.