
- ఆయన హెల్త్ కండీషన్‌పై ఆరా తీసిన రేవంత్ రెడ్డి
హైదరాబాద్, వెలుగు: మాజీ సీఎం, బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ ఆరోగ్యం గురించి సీఎం రేవంత్ రెడ్డి ఆరా తీశారు. గురువారం కేసీఆర్ అనారోగ్యంతో ఓ ప్రైవేట్ హాస్పిటల్‌లో చేరారు. దీంతో హాస్పిటల్ డాక్టర్లు, అధికారులతో మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి.. కేసీఆర్‌కు ఉత్తమ చికిత్స అందించాలని కోరారు. ఆయన త్వరగా కోలుకోవాలని, సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని ఆకాంక్షించారు.