సీఎంకు నీలం మధు జన్మదిన శుభాకాంక్షలు

సీఎంకు నీలం మధు జన్మదిన శుభాకాంక్షలు
  • జనహితమే అభిమతంగా ప్రజాపాలన సాగుతున్నదని వెల్లడి 

హైదరాబాద్, వెలుగు: సీఎం రేవంత్ రెడ్డి జన్మదినం సందర్భంగా శనివారం హైదరాబాద్ జుబ్లీహిల్స్ లోని నివాసంలో ఆయన్ను కలిసి మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఇన్ చార్జ్ నీలం మధు ముదిరాజ్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మధు మాట్లాడుతూ.. పదేండ్లు నిర్లక్ష్యానికి గురైన తెలంగాణను  ప్రణాళిక బద్ధంగా అభివృద్ధి చేస్తూ జనహితమే అభిమతంగా సీఎం రేవంత్ పాలన సాగిస్తున్నారని తెలిపారు. ఇందిరమ్మ స్ఫూర్తితో తెలంగాణ పునర్నిర్మాణానికి రేవంత్ కృషి మరువలేనిదన్నారు. 

నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజా సంక్షేమం, అభివృద్ధి కోసం ప్రజా పాలన సాగిస్తున్న ఘనత ఆయనకే దక్కుతుందన్నారు. గత పాలకులచే నిర్లక్ష్యానికి గురైన రంగాలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి రాష్ట్రాభివృద్ధికి కృషి చేస్తున్నారని కొనియాడారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన ఒక్కొక్క హామీని నెరవేర్చి రాష్ట్రాన్ని సంక్షేమంతో పాటు అభివృద్ధిలో పరుగులు పెట్టిస్తున్నారన్నారు.

బడుగు బలహీనవర్గాల అభ్యున్నతికి పర్యాయ పదంగా రేవంత్ పాలన ఉందన్నారు. బడుగులకు రాజకీయాల్లో అవకాశాలు పెంచాలనే స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ బిల్లులు ఆమోదించి కేంద్రానికి పంపారని గుర్తు చేశారు.