ఇండ్ల మంజూరులో అవినీతికి పాల్పడితే చర్యలు : కలెక్టర్​జితేశ్​ వి పాటిల్​​ 

 ఇండ్ల మంజూరులో అవినీతికి పాల్పడితే చర్యలు :  కలెక్టర్​జితేశ్​ వి పాటిల్​​ 
  • భద్రాద్రికొత్తగూడెం కలెక్టర్​జితేశ్​ వి పాటిల్​​ 

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : డబుల్​ బెడ్​ రూమ్​ ఇండ్ల మంజూరులో అవినీతికి పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్​ జితేశ్​ వి పాటిల్​ హెచ్చరించారు. కలెక్టరేట్​లో పలు శాఖల ఆఫీసర్లతో మంగళవారం నిర్వహించిన మీటింగ్​లో ఆయన మాట్లాడారు. అర్హులైన వారికే డబుల్​ బెడ్​ రూమ్​ ఇండ్లను శాంక్షన్​ చేయాలన్నారు. ఫ్యామిలీ డిజిటల్​ కార్డు కోసం కుటుంబ వివరాలను పక్కాగా సేకరించాలని ఆఫీసర్లను ఆదేశించారు. వంద శాతం కుటుంబసర్వేను చేపట్టాలన్నారు. 

ఏకో బ్రిక్స్​ తయారీ విజేతలకు బహుమతులు

స్వచ్​ భారత్​ మిషన్​, స్వచ్ఛతా హి సేవ ప్రోగ్రాంలో భాగంగా జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన పోటీల్లో ఆకట్టుకునే విధంగా  ఎకో బ్రిక్స్​తయారు చేసిన వారికి కలెక్టర్​ బహుమతులను అందజేశారు. కలెక్టరేట్​లో జరిగిన ప్రోగ్రాంలో వినూత్నంగా ఎక్కువ సంఖ్యలో ఏకో బ్రిక్స్​ తయారు చేసిన బూర్గంపహడ్, సుజాతనగర్, లక్ష్మీదేవిపల్లి ఎంపీడీవోలకు, పంచాయతీ కార్యదర్శులను కలెక్టర్​ ప్రశంసించారు. వ్యర్థాలతో అర్థవంతమైన కళాకృతులు తయారు చేసే పోటీలో ప్రతిభ చూపిన స్టూడెంట్స్​కు ఆయన బహుమతులు అందజేశారు.

ఇలాంటి ప్రోగ్రామ్స్​ నెలకోసారి జరిగేలా చూడాలని ఆఫీసర్లను ఆదేశించారు. స్కూల్​ లెవెల్​లో సులానగర్​ స్కూల్​కు చెందిన ఎనిమిదో తరగతి స్టూడెంట్​ ఎన్​. మనస్విని ఫస్ట్​, రామవరం స్కూల్​కు చెందిన తొమ్మిదో తరగతికి చెందిన సాయి హరిత సెకండ్​, పోకల గూడెంకు చెందిన ఎనిమిదో తరగతి స్టూడెంట్​ బి. ధనూష్​ థర్డ్​ ప్లేస్​లో నిలిచారు. ఇంటర్​ స్థాయిలో ములకలపల్లి మండలంలోని సోషల్​ వెల్ఫేర్​ గురుకుల కాలేజీకి చెందిన ఎస్​. జ్యోత్స్న ఫస్ట్​ , భద్రాచలానికి చెందిన రాంచరన్​ సెకండ్​ ప్లేస్​లో నిలిచారు. 

వృద్ధుల సంక్షేమానికి ప్రాధాన్యత.. 

వృద్ధుల సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని కలెక్టర్​ తెలిపారు. కలెక్టరేట్​లో నిర్వహించిన అంతర్జాతీయ వయో వృద్ధుల దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రోగ్రాంలో ఆయన మాట్లాడారు. సీనియర్​ సిటిజన్స్​ అసోసియేషన్​ కమ్యూనిటీ హాల్​ బిల్డింగ్​ నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేస్తామన్నారు.అనంతరం పలువురు సీనియర్ సిటిజన్స్​ను కలెక్టర్​ సన్మానించారు.