సంగారెడ్డి జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్య సేవలను మెరుగుపర్చాలి : కలెక్టర్ ప్రావీణ్య

సంగారెడ్డి జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో  వైద్య సేవలను మెరుగుపర్చాలి : కలెక్టర్  ప్రావీణ్య

సంగారెడ్డి టౌన్, వెలుగు: జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్య సేవలను మరింత మెరుగుపర్చాలని కలెక్టర్ ప్రావీణ్య  సూచించారు. గురువారం సంగారెడ్డి కలెక్టరేట్ లో జరిగిన 17వ కామన్ రివ్యూ మిషన్ బృందం సమావేశానికి అధ్యక్షత వహించారు.

 అనంతరం మాట్లాడుతూ.. ఈ వైద్య బృందం ఈ నెల 3 నుంచి 5 వరకు సంగారెడ్డి జిల్లాలో పర్యటించిందన్నారు. ఈ సందర్భంగా సంగారెడ్డి జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి, పటాన్‌‌చెరు ఏరియా హాస్పిటల్, నారాయణఖేడ్ ఏరియా హాస్పిటల్, సదాశివ్ పేట  సీహెచ్‌‌సీ, ఆత్మకూరు, కంగ్టి, ఆర్‌‌సీ పురం ప్రాథమిక కేంద్రాలు, మార్క్స్ నగర్ యూపీహెచ్​సీ, ఇందిరానగర్ బస్తీ దవాఖాన, ఆయుష్  డిస్పెన్సరీలను సందర్శించి వివరాలు సేకరించిందని పేర్కొన్నారు. 

ఈ బృందానికి టీమ్ లీడర్‌‌గా  డాక్టర్ అనురాధ మేడోజు వ్యవహరించారన్నారు. సభ్యులుగా డాక్టర్లు సంతోష్ నాయక్, రంజన్ దాస్, కవిత చౌదరి, అరుణ్ శర్మ, పర్వీన్ సుల్తానా ఉన్నారని చెప్పారు. సమావేశంలో డీఎంహెచ్​వో నాగ నిర్మల, జీజీహెచ్​సూపరింటెండెంట్  మురళీకృష్ణ , డీసీహెచ్ఓ, వైద్య ఆరోగ్యశాఖ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.