సీహెచ్​సీల్లో నెలకు 50 డెలివరీలు చేయాలి : రిజ్వాన్​ బాషా షేక్​

సీహెచ్​సీల్లో నెలకు 50 డెలివరీలు చేయాలి : రిజ్వాన్​ బాషా షేక్​
  • కలెక్టర్​ రిజ్వాన్​ బాషా షేక్​

జనగామ, వెలుగు: వైద్య సేవల్లో నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్​ రిజ్వాన్​బాషా షేక్​ హెచ్చరించారు. గురువారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్​కాన్ఫరెన్స్ హాల్​లో డీఎంహెచ్ వో మల్లికార్జున్​ రావు, డీసీహెచ్​వీరాంజనేయులుతో కలిసి వైద్య శాఖ అధికారులతో రివ్యూ నిర్వహించారు. ప్రతీ సీహెచ్ సీలో నెలకు 50, పీహెచ్​సీలలో 15కు తగ్గకుండా డెలివరీలు చేయాలని ఆదేశించారు. ప్రతీ సబ్​సెంటర్​లో ఓపీ 50కి తగ్గకుండా చూడాలని చెప్పారు.

అంగన్​వాడీ కేంద్రాల్లో నిర్వహిస్తున్న కంటి పరీక్షలను వచ్చే నెల 15 వరకు పూర్తి చేయాలని పేర్కొన్నారు. డాక్టర్లు, వైద్య సిబ్బంది సమయపాలన పాటిస్తూ మెరుగైన వైద్య సేవలందించాలని సూచించారు. ప్రోగ్రాం ఆఫీసర్లు రవీందర్​ గౌడ్, స్వర్ణకుమారి, అశోక్, కమల్​ హాసన్, సీహెచ్​సీల సూపరింటెండెంట్లు, పీహెచ్​సీ వైద్యాధికారులు పాల్గొన్నారు. 

అమ్మ సేవలను వెలకట్టలేం

అమ్మ సేవలను వెలకట్టలేమని కలెక్టర్​ రిజ్వాన్​బాషా షేక్​ అన్నారు. గురువారం కలెక్టరేట్​లోని కాన్ఫరెన్స్​హాల్​లో హైదరాబాద్ కంచి వెల్ఫేర్​సొసైటీ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మాతృ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన కలెక్టర్ మాట్లాడుతూ.. తల్లులు తమ పిల్లలను సన్మార్గంలో నడిపించేందుకు శ్రమిస్తారన్నారు. ప్రతీ మహిళ కుటుంబంలో, సమాజంలో కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేసే అంటెండర్లు, ఆశవర్కర్లు, పారిశుధ్య కార్మికులకు చీరలు పంపిణీ చేశారు. డీడబ్ల్యూవో ఫ్లోరెన్స్, తిరుమల బ్యాంకు చైర్మన్ నంగునూరి చంద్రశేఖర్, కంచి వెల్ఫేర్​సొసైటీ ప్రతినిధి పరమేశ్వరి శర్మ, మేకపోతుల ఆంజనేయులు గౌడ్​, డీపీవో స్వరూప, ప్రోగ్రాం ఆఫీసర్​రవీందర్​గౌడ్ పాల్గొన్నారు.