
- కలెక్టర్ సంతోష్
గద్వాల, వెలుగు : ఇష్టంగా చదివితేనే విజయం వరిస్తుందని కలెక్టర్ సంతోష్ విద్యార్థులకు సూచించారు. శుక్రవారం కలెక్టరేట్ మీటింగ్ హాల్లో పదో తరగతి స్టూడెంట్స్కు లక్ష్య నిర్దేశం, జీవన నైపుణ్యాలపై ప్రేరణ తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ చదువులకు సమస్యలు అడ్డు కాకూడదన్నారు. సమస్యలన్నీ పక్కనపెట్టి కష్టమైనప్పటికీ ఇష్టంగా చదివితే విజయం సాధించవచ్చన్నారు. తను ఇంజినీరింగ్ కంప్లీట్ చేసినప్పటికీ ఇతరులతో ప్రేరణ పొంది ఐఏఎస్ కాగలిగానని వివరించారు. ఈసారి జిల్లాలో పదో తరగతిలో 100% ఫలితాలు సాధించాలని సూచించారు. కార్యక్రమంలో డీవో అబ్దుల్ ఘని, మోటివేటర్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
ఇందిరమ్మ ఇండ్లను పరిశీలించిన కలెక్టర్..
గద్వాల మున్సిపాలిటీ పరిధిలోని జమ్మిచెడు కాలనీలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను కలెక్టర్ పరిశీలించారు. నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేసేందుకు ఆఫీసర్లు కృషి చేయాలన్నారు. కలెక్టర్ వెంట హౌసింగ్ పీడీ శ్రీనివాసరావు, డీఈ కాశీనాథ్, ఏఈ ప్రకాశ్, మున్సిపల్ కమిషనర్ జానకీరామ్ తదితరులు ఉన్నారు.