బతుకమ్మ వేడుకల్లో ఆడిపాడిన కలెక్టర్ అభిలాష అభినవ్

బతుకమ్మ వేడుకల్లో ఆడిపాడిన కలెక్టర్ అభిలాష అభినవ్

నిర్మల్/ఆదిలాబాద్ టౌన్/కోల్​బెల్ట్/జైపూర్, వెలుగు: బతుకమ్మ వేడుకల్లో కలెక్టర్లు పాల్గొని ఆడిపాడారు. నిర్మల్ కలెక్టరేట్ ఆవరణలో సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన బతుకమ్మ సంబరాల్లో కలెక్టర్ అభిలాష అభినవ్ తోటి మహిళలతో కలిసి ఆడిపాడారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని సాంఘిక సంక్షేమ శాఖ కార్యాలయంలో జరిగిన వేడుకల్లో కలెక్టర్ రాజర్షి షా, అడిషనల్​కలెక్టర్ ​శ్యామలాదేవి పాల్గొన్నారు. బతుకమ్మ గీతాలు ఆలపిస్తూ కోలాటాలు ఆడారు. 

మందమర్రి ఏరియా సింగరేణి యాజమాన్యం ఆధ్వర్యంలో సోమవారం రాత్రి స్థానిక సీఈఆర్​ క్లబ్​లో నిర్వహించిన ఫ్యామిలీ డే వేడుకలు అలరించాయి. ఈ సందర్భంగా బతుకమ్మ ఆటపాట కార్యక్రమాన్ని నిర్వహించారు. మందమర్రి ఏరియా సింగరేణి జీఎం ఎన్.​రాధాకృష్ణ--శ్రీవాణి దంపతులు ప్రారంభించారు. జైపూర్ తహసీల్దార్ ఆఫీసులో తహసీల్దార్ వనజారెడ్డి ఆధ్వర్యంలో బతు కమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు.