ఫంక్షన్ కు వచ్చి ఈలలు వింటుంటే.. ఆ కిక్కే వేరప్పా

ఫంక్షన్ కు వచ్చి ఈలలు వింటుంటే.. ఆ కిక్కే వేరప్పా
  • లవ్ స్టొరీ సినిమా ప్రీరిలీజ్  ఈవెంట్ లో చిరంజీవి 

‘‘చిన్న పిల్లలు కరోనా తరువాత స్కూల్ కి వెళితే ఎలా వుంటుందో ఈ ఫంక్షన్ నాకు అలా వుంది. ఇలా ఫంక్షన్స్ కి వచ్చి ఈలలు వింటూ వుంటే ఆ కిక్కే వేరు అప్పా.. ’’ అన్నారు హీరో చిరంజీవి. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగచైతన్య, సాయిపల్లవి జంటగా నటించిన ‘లవ్ స్టోరీ’ సినిమా ఈనెల 24న థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ నేపధ్యంలో ఆదివారం హైదరాబాద్ లో ప్రిరిలీజ్ వేడుక జరిగింది. కార్యక్రమానికి బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్, మెగా స్టార్ చిరంజీవి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. 
ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ.. నారాయణ్ దాస్ నారంగ్ గారు నాకు ఎంతో సన్నిహితులు.. వాళ్ల అబ్బాయి సునీల్ తండ్రి కి మించిన తనయుడు.. వీళ్లు మరింత ఎత్తు కి ఎదగాలి మరిన్ని సినిమాలు తీయాలని ఆకాంక్షించారు. నాగార్జున కొడుకు నాగ చైతన్య వెరీ కూల్ గా.. ప్రపోజల్ గా వుంటాడు. చాలా నిలకడ గా నిదానంగా వుంటాడు. అతను తీసుకొనే నిర్ణయాలు చాలా లాంగ్ కన్ స్ట్రక్టివ్ గా వుంటాయి.. ఇక సాయి పల్లవి వెరీ గుడ్ డాన్సర్.. ఒక సినిమాలో సాయిపల్లవి నా చెల్లెలి క్యారెక్టర్ వేయాల్సి ఉంది.. కానీ తను చేయను అని అంది..  అలా ఎందుకు అన్నది నాకు తెలీదు అన్నారు. 
అందుకే శేఖర్ కమ్ముల సినిమాలన్నీ సూపర్ హిట్
‘దర్శకుడు శేఖర్ కమ్ముల తనకు తాను ఏమనుకుంటారో అదే తీస్తారు.. కమర్షియల్ అంశాలు పట్టించుకోరు.. అందుకే ఆయన ప్రతి సినిమా సూపర్ హిట్ లుగా నిలిచాయి అని చిరంజీవి ప్రశంసించారు. సినిమాలో సారంగ దరియా పాట పెద్ద హిట్ అయ్యింది. ఆ సాంగ్ కోసం నేను ఈసినిమా రెండు మూడు సార్లు చూస్తాను.. ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలి అని కోరుకుంటున్నాను’ అని చిరంజీవి అన్నారు. సినిమా ఇండస్ట్రీ లో సక్సెస్ రేటు 20 శాతం మాత్రమే, దీనికి సినిమా వాళ్లందరూ పచ్చగా వున్నారు అని అనుకుంటారు.. కానీ ఇక్కడ కూడా చాలా మంది చాలా కష్టాలు పడుతున్నారు.. ఏ ప్రమాదాలు వచ్చినా..  ఏ విపత్తు వచ్చినా స్పందించేది ఫస్ట్ సినిమా ఇండస్ట్రీ నే.. అన్నారు. 
తెలుగు పరిశ్రమ సమస్యలు తెలుగు ప్రభుత్వాలు పరిష్కరించాలి
‘తెలుగు చిత్ర పరిశ్రమలో  ఒక రిద్దరు మాత్రమే ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు.. మిగతా వాళ్ళు అందరూ సినిమాకోసం కష్ట పడుతున్నారు.. కాబట్టి రెండు తెలుగు ప్రభుత్వాలకు నేను విన్నవించ కుంటున్నాను.. ఇండస్ట్రీ సమస్యలను రెండు ప్రభుత్వాలు కూడా పరిష్కరించండి..’ అని చిరంజీవి కోరారు.  ఆచార్య సినిమా షూటింగ్ అయిపోయింది... అసలు ఇప్పుడు ఏ సినిమా తియ్యాలి అంటేనే ఆలోచిస్తున్నాము.. దయచేసి రెండు తెలుగు ప్రభుత్వాలు సిని పరిశ్రమ సమస్యలపై దృష్టి పెట్టి జీవో లు ఇవ్వాలని చిరంజీవి కోరారు. సాయి పల్లవి లాంటి హీరోయిన్ తో డాన్స్ చేయాలి కానీ చెల్లెమ్మ అనే డైలాగ్ ఎలా చెబుతాం అని అన్నారు. 
హీరోయిన్ సాయి పల్లవి మాట్లాడుతూ..  సార్ నేను ఎక్కడకి వెళ్ళినా చిరు ని కలిసారా అని అడుగుతారు.. మీరు పెద్ద స్థాయి వ్యక్తులు... అందుకే నాకు భయ్యం అని అన్నారు.