
- కడియం శ్రీహరి దిష్టిబొమ్మ దగ్ధం
జనగామ జిల్లా : టీఆర్ఎస్ నేతల విభేదాలు భగ్గుమన్నాయి. చిల్పూర్ మండలం లింగంపల్లిలో మాజీ ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి దిష్టిబొమ్మను ఊరేగించి దగ్ధం చేశారు. కడియం దిష్టిబొమ్మ దగ్ధం చేసింది సాక్షాత్తు అధికార పార్టీ ఎమ్మెల్యే, మాజీ ఉప ముఖ్యమంత్రి రాజయ్య అనుచరులేనన్న విషయం హాట్ టాపిక్ అయింది.
స్టేషన్ ఘనపూర్ లో కడియం శ్రీహరి, ఎమ్మెల్యే రాజయ్య వర్గీయుల మధ్య విభేదాలున్న విషయం బహిరంగ రహస్యం. ఇంత వరకు అదుపులోనే ఉన్న విభేదాలు సోమవారం ఏకంగా రోడ్డునపడడం సంచలనం సృష్టించింది. లింగంపల్లి రిజర్వాయర్ నిర్మాణం త్వరగా పూర్తి చేయాలని నిన్న దేవాదుల రివ్యూ మీటింగ్ లో కడియం శ్రీహరి కోరారు. అయితే ఈ రిజర్వాయర్ నిర్మాణం వల్ల తమ గ్రామం నీట మునిగిపోతుందని ఆందోళన వ్యక్తం చేస్తూ లింగంపల్లి గ్రామస్తులు కడియం శ్రీహరి దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. ఎమ్మెల్యే రాజయ్య వర్గీయులే పనేనని కడియం వర్గీయులు ఆరోపిస్తున్నారు.