
గోదావరిఖని, వెలుగు: అంతర్గాంలో ఎయిర్పోర్టు ఏర్పాటుకు కృషి చేస్తున్న పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణకు కృతజ్ఞతలు తెలుపుతూ కాంగ్రెస్లీడర్లు ఆదివారం గోదావరిఖని చౌరస్తాలో ఆయన ఫ్లెక్సీకి క్షీరాభిషేకం చేశారు. పటాకులు కాల్చి, స్వీట్లు పంచిపెట్టారు. అంతర్గాంలోని 591 ఎకరాల స్థలంలో గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్టు ఏర్పాటు కోసం ప్రీ - ఫిజిబులిటీ స్టడీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.40.53 లక్షల ఫీజును ఎయిర్ పోర్టు అథారిటీ ఆఫ్ఇండియాకు చెల్లించడంతో ఎంపీ కీలకంగా వ్యవహరించారని అన్నారు.
పార్టీ నాయకుడు కామ విజయ్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో లీడర్లు అనుమాన శ్రీనివాస్, ఎండీ.రఫీక్, వాసర్ల సురేందర్, హకీమ్, తిప్పారపు మధు, కోరం నరేందర్ రెడ్డి, రాకేశ్, జావెద్, శ్యాంసుందరాచారి, కిశోర్, మధు, మహేశ్, శ్రీకాంత్, శ్రీను, విజయ్, శేఖర్, మహేందర్, అశోక్, సర్దార్, శ్రవణ్, సతీశ్తదితరులు పాల్గొన్నారు.