బీసీలకు అన్యాయం చేసింది కాంగ్రెస్సే : ఎమ్మెల్యే పాయల్ శంకర్

బీసీలకు అన్యాయం చేసింది కాంగ్రెస్సే : ఎమ్మెల్యే పాయల్ శంకర్

ఆదిలాబాద్​టౌన్​, వెలుగు: కొన్ని దశాబ్దాలుగా కాంగ్రెస్​ బీసీలకు అన్యాయం చేస్తోందని ఎమ్మెల్యే పాయల్ శంకర్​ విమర్శించారు. శుక్రవారం స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.  టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్​కుమార్​గౌడ్​ బీజేపీ రాష్ర్ట అధ్యక్షుడి నియామకానికి బీసీలు దొరకలేదా అనడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు.  బీజేపీ అంటేనే బీసీలకు, బడగు బలహీన వర్గాలకు న్యాయం చేసే పార్టీ అన్నారు. 

ఉమ్మడి రాష్ర్టం ఉన్న నాటి నుంచి కాంగ్రెస్​ అధికారంలో ఉన్నపుడు అగ్రవర్ణాలకే ముఖ్యమంత్రి పదవి కట్టబెట్టిందని పేర్కొన్నారు. ప్రభుత్వానికి బీసీలపై ప్రేమ ఉంటే ముందు సీఎంను బీసీని చేసి జనాభా దమాషా ప్రకారం రాష్ర్టంలో బీసీలకు మంత్రి పదవులు ఇవ్వాలని డిమాండ్​ చేశారు. తమ రాష్ర్ట అధ్యక్షుడిని విమర్శించే హక్కు కాంగ్రెస్​కు లేదన్నారు. నాయకులు ఆకుల ప్రవీణ్, రఘుపతి, లాలమున్న, జోగు రవి, కృష్ణ యాదవ్, భరత్, భీమ్ సేన్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.