తెలంగాణ పీసీసీ నేతలతో కాంగ్రెస్ అధిష్టానం భేటీ

తెలంగాణ పీసీసీ నేతలతో కాంగ్రెస్ అధిష్టానం భేటీ

మునుగోడు బైపోల్ పై కాంగ్రెస్ హైకమాండ్  సీరియస్ గా  ఫోకస్ చేసింది ఇవాళ సాయంత్రం 5 గంటలకు టెన్ జన్ పథ్ లోని సోనియా గాంధీ నివాసంలో తెలంగాణ పీసీసీ నేతలతో ప్రియాంకగాంధీ భేటీ కానున్నారు . మునుగోడు ఉప ఎన్నికతో పాటు, రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితులు, నాయకుల మధ్య విభేదాలపై చర్చించే అవకాశం ఉంది.

పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ మాణిక్కం ఠాగూర్లపై సీనియర్ నాయకుల విమర్శలపై కూడా డిస్కస్ చేయనున్నట్లు తెలుస్తోంది. ప్రియాంక గాంధీ, కేసీ వేణుగోపాల్, మాణిక్కం ఠాగూర్ తో పాటు పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎంపీలు ఉత్తమ్ కుమార్ రెడ్డి,  కోమటిరెడ్డి వెంకట రెడ్డి, దామోదర్ రాజనర్సింహ మీటింగ్ హజరుకానున్నారు.