- వేలానికి సిద్ధమవుతున్న హెచ్ఎండీఏ ఆఫీసర్లు
- వచ్చే నెలలో 70 ఎకరాల అమ్మకానికి నోటిఫికేషన్!
హైదరాబాద్‌సిటీ,వెలుగు: హెచ్ఎండీఏ మరోసారి కోకాపేట భూముల వేలానికి సిద్ధమవుతోంది. ఈసారి నియోపోలిస్ లేఔట్‌ను ఆనుకుని 70 ఎకరాలను వేలం వేసేందుకు ఆఫీసర్లు నిర్ణయించారు. ఇటీవల 27 ఎకరాలను వేలం వేయగా హెచ్ఎండీఏకు రూ. 3,867 కోట్ల ఆదాయం సమకూరింది. ఈసారి రూ. 800 కోట్ల ఆదాయం టార్గెట్‌గా పెట్టుకుంది. హెచ్ఎండీఏ లే ఔట్లకు కొనుగోలుదారుల నుంచి భారీ స్పందన ఉంటుంది.
ఎలాంటి లిటిగేషన్లు లేని, క్లియర్టైటిల్స్కలిగి రూల్స్ మేరకు లేఔట్ చేయడంతో పాటు అన్నిరకాల మౌలిక సదుపాయాలతో అభివృద్ధి చేశారు. తాజాగా వేలం వేయాలనుకునే భూములను గత పదేండ్ల కింద కొన్ని ఐటీ కంపెనీలు, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌ల ఏర్పాటుకు లీజుకు కేటాయించారు. దాదాపు11 సంస్థలకు 70 ఎకరాల భూమిని ఇచ్చారు. రూల్స్ మేరకు నిర్ణీత కాలపరిమితిలో ఇప్పటివరకూ ఏ కంపెనీ కూడా సంస్థను ఏర్పాటు చేయలేదు.
కొన్ని కంపెనీలు భూములను తిరిగి ఇచ్చాయి. మరికొన్నింటి నుంచి తిరిగి స్వాధీనం చేసుకుంది. ఆయా భూములను మౌలిక సదుపాయాలతో అభివృద్ధి చేసినట్టు అధికారులు తెలిపారు. కోకాపేటలోని భూములకు భారీగా డిమాండ్ఉంది. ఈ ప్రాంతం నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్చాలా దగ్గరగా ఉండడం, పరిసరాల్లోనే ఐటీ కంపెనీలు, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌తో పాటు ఔటర్ రింగ్ రోడ్‌కు అతి సమీపంలోనే ఉంది. దీంతో ఇక్కడి భూములకు జాతీయ, అంతర్జాతీయ సంస్థలు, రియల్ఎస్టేట్ డెవలపర్లు, నిర్మాణదారులు కొనుగోలుకు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. ఇటీవల వేసిన భూముల వేలంలో గరిష్టంగా ఎకరానికి రూ. 151 కోట్లు పలికింది.
వచ్చే నెలలో నోటిఫికేషన్!
వచ్చే జనవరి రెండో వారంలో 70 ఎకరాల వేలానికి నోటిఫికేషన్రానుందని అధికారులు తెలిపా రు.హెచ్ఎండీఏ పరిధి విస్తరణతో పాటు మరిన్ని భారీ ప్రాజెక్టులు చేపట్టనుండగా.. నిధుల కొరత రాకుండా ఆదాయం సమకూర్చుకునే పనిలో ఉంది. ముఖ్యంగారైజింగ్ తెలంగాణ – 2045 పేరుతో ప్రభుత్వం పలు కొత్త ప్రాజెక్టులను చేపట్టనుంది.
ఇప్పటికే టెండర్ల ప్రకియ పూర్తయిన ఎలివేటెడ్కారిడార్స్, బంజారాహిల్స్నుంచి కొండాపూర్వరకు కొత్తగా మరో ఎలివేటెడ్కారిడార్తో పాటు, మెట్రోరైల్ విస్తరణ, స్కైవాక్‌లు, రేడియల్రోడ్ల నిర్మాణాలను చేపట్టేందుకు హెచ్ఎండీఏ ప్రతిపాదనలు చేసింది. ఆయా ప్రాజెక్టులకు కావాల్సిన నిధులను భూముల వేలం ద్వారా సమకూర్చుకోనున్నట్టు అధికారులు తెలిపారు. నియోపోలిస్‌లో ఏర్పాటు చేసినట్టు గానే 4 నుంచి 5.5 ఎకరాల చొప్పున ఒక్కో ప్లాట్‌ను రూపొందించి వేలం వేయనున్నట్టు అధికారులు పేర్కొన్నారు.
