వీధి రౌడీలా మాట్లాడుతున్నవ్.. కామారెడ్డి ఎమ్మెల్యేపై కాంగ్రెస్లీడర్ల ఫైర్

వీధి రౌడీలా మాట్లాడుతున్నవ్.. కామారెడ్డి ఎమ్మెల్యేపై కాంగ్రెస్లీడర్ల ఫైర్

కామారెడ్డి, వెలుగు : కామారెడ్డి ఎమ్మెల్యే వీధి రౌడీలా మాట్లాడుతున్నారని, ఆయన బండారం బయటపెడతామని కాంగ్రెస్ లీడర్లు హెచ్చరించారు.  మంగళవారం  పీసీసీ జనరల్ సెక్రటరీ బద్దం ఇంద్రకరణ్​రెడ్డి,  లైబ్రరీ జిల్లా చైర్మర్​ మద్ది చంద్రకాంత్​రెడ్డి,  మాజీ డీసీసీ ప్రెసిడెంట్​ కైలాస్ శ్రీనివాస్​రావు,  కామారెడ్డి టౌన్ ప్రెసిడెంట్ పండ్ల రాజు మంగళవారం మీడియాతో మాట్లాడారు. మున్సిపాలిటీ చేజారిందన్న మనోవేదనతో ఎమ్మెల్యే మతిభ్రమించి మాట్లాడుతున్నారని విమర్శించారు.  

షబ్బీర్​అలీపై ఆరోపణలు చేస్తే సహించే ప్రసక్తే లేదన్నారు.  షబ్బీర్​అలీ, వారి కుటుంబ సభ్యులు డబ్బులు చెల్లించి భూములు కొన్నారు తప్పా ఎవరినీ బెదిరించి కబ్జాలు చేయలేదన్నారు. ఎమ్మెల్యే కబ్జా చిట్టాలను బయట పెడతామని హెచ్చరించారు.  రిటైర్డు ఉద్యోగుల భూమి కబ్జా చేశారని ఆరోపించారు.  కర్షక్​ విద్యా సంస్థల భూములు ఇంజినీరింగ్​ కాలేజీకి దారాదత్తం చేశారన్నారు.  దమ్ముంటే సీఎస్​ఐ గ్రౌండ్​కు ఎమ్మెల్యే రావాలని సవాల్​విసిరారు. గత ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు నేరవేర్చాలని డిమాండ్​చేశారు.