మోడీ,అమిత్‌షాలపై సుప్రీంలో కోర్టు ధిక్కరణ కేసు

V6 Velugu Posted on Jul 30, 2021

ప్రధాని మోడీ, హోం మంత్రి అమిత్‌ షా కోర్టు ఆదేశాల ధిక్కరణకు పాల్పడ్డారంటూ సుప్రీం కోర్టులో పిటిషన్‌ దాఖలైంది. లాయర్‌ ఎంఎల్‌ శర్మ ఈ పిటిషన్‌ దాఖలు చేశారు. ప్రకాష్‌ సింగ్‌ కేసులో సుప్రీం ఇచ్చిన ఆదేశాల ప్రకారం ఓ అధికారి DGPగా నియమించాలంటే రిటైర్మెంట్ కు కనీసం అతనికి మూడు నెలల సర్వీసు ఉండి ఉండాలి. కాని ఈ ఆదేశాలకు భిన్నంగా సీనియర్‌ IPS ఆఫీసర్‌ రాకేష్‌ ఆస్తానాను ఢిల్లీ పోలీస్‌ కమిషనర్‌గా నియమించారని ఎంఎల్‌ శర్మ పిటిషన్ దాఖలు చేశారు. అపాయింట్‌మెంట్‌ కమిటీ ఛైర్మన్‌ అయిన ప్రధాని, రాకేష్‌ను నియమించిన హోం మంత్రి కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించారని ఆయన తన పిటిషన్‌లో తెలిపారు.

అయితే మరో నాలుగు రోజుల్లో రిటైర్‌ అవుతున్న రాకేష్‌ ఆస్తానాను ఢిల్లీ పోలీస్‌ కమిషనర్‌గా హోం శాఖ నియమించింది. ప్రధాని ఆదేశాల మేరకే అమిత్‌ షా ఈ నియామకం చేశారని పిటిషనర్‌ ఆరోపించారు.1984 బ్యాచ్‌కు చెందిన ఆస్తానా గతంలో CBI స్పెషల్‌ డైరెక్టర్‌గా పనిచేశారు. అప్పటి డైరెక్టర్‌ అలోక్‌ శర్మకు, ఆస్తానాకు మధ్య పెద్ద గొడవ కూడా జరిగింది.

Tagged supreme court, PM Modi, Amit Shah , Contempt plea

Latest Videos

Subscribe Now

More News