హైదరాబాద్, వెలుగు: ఎరువుల తయారీ కంపెనీ కోరమాండల్ సిద్దిపేట జిల్లా షామీర్‌పేట్‌లోని తన రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ (ఆర్ అండ్ డీ) ఫామ్‌లో హై టెక్ పాలీహౌస్‌ను ఏర్పాటు చేసింది. కొత్త ప్రొడక్ట్‌లను ఇక్కడ డెవలప్ చేస్తారు.
ఈ హై టెక్ పాలీహౌస్‌లో అడ్వాన్స్డ్ ఫీల్డ్ ట్రయల్స్ నిర్వహించడానికి కంపెనీకి వీలుంటుందని కోరమాండల్ పేర్కొంది. కోరమాండల్ ఇన్వెస్ట్ చేసిన కంపెనీ ఎక్స్ మెషిన్స్ అటానమస్ రోబోటిక్ ఫామ్ మెషినరీని డెవలప్ చేసింది. దీని గురించి సోమవారం చర్చించారు.