రాష్ట్రంలో కరోనా విజృంభన.. భారీగా కేసులు నమోదు

రాష్ట్రంలో కరోనా విజృంభన.. భారీగా కేసులు నమోదు

రాష్ట్రంలో కరోనా విజృంభిస్తోంది. మహారాష్ట్ర నుంచి స్ర్పెడ్ అయిన వైరస్ వేగంగా వ్యాపిస్తోంది.  దాంతో మునుపెన్నడూ లేనవిధంగా భారీగా కేసులు నమోదవుతున్నాయి. రాష్ట్రంలో కొత్తగా 5093 కేసులు నమోదయ్యాయి. దాంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,51,424కు చేరింది. కరోనా కారణంగా శనివారం 15 మంది చనిపోయారు. దాంతో ఇప్పటి వరకు చనిపోయినవారి సంఖ్య 1824కు చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 37,037 యాక్టివ్ కేసులున్నాయని వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. అదేవిధంగా మరో 24,156 మంది హోంఐసోలేషన్‌లో ఉన్నారని ప్రకటించింది. శనివారం రాష్ట్రవ్యాప్తంగా 1,29,637 పరీక్షలు చేయగా.. మొత్తం పరీక్షల సంఖ్య 1,17,37,753గా నమోదైంది. 

తాజాగా జీహెచ్ఎంసీ పరిధిలో అత్యధికంగా 743 కేసులు నమోదయ్యాయి. మేడ్చల్ మల్కాజ్ గిరి 488, రంగారెడ్డి 407, నిజామాబాద్ 367, సంగారెడ్డి 232, కామారెడ్డి 232, జగిత్యాల 223, వరంగల్ అర్బన్ 175, మహబూబ్ నగర్ 168, ఖమ్మం 155, కరీంనగర్ 149, నల్గొండ 139, నిర్మల్ 139, మంచిర్యాల 124, వికారాబాద్ 122, సిద్ధిపేట 117, రాజన్ప సిరిసిల్ల 106, మెదక్ 101, నాగర్ కర్నూల్ 101  కేసులు నమోదయ్యాయి.

రాష్ట్రంలో కరోనా కేసులు 5 వేలు దాటడం ఇదే మొదటిసారి. ఫస్ట్ వేవ్‌లో కన్నా సెకండ్ వేవ్‌లో కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉంది. ప్రస్తుతం గాలి ద్వారా వైరస్ వ్యాపిస్తుందని వైద్యులు అంటున్నారు.