వరంగల్ సిటీ, వెలుగు: నేటి నుంచి ఏనుమాముల వ్యవసాయ మార్కెట్లో పత్తి కొనుగోళ్లను నిలిపివేయనున్నారు. సీసీఐ అనుసరిస్తున్న విధానాల వల్ల మిల్లర్లకు అన్యాయం జరుగుతుందని, దీనికి నిరసనగా పత్తి కొనుగోళ్లను రాష్ర్ట వ్యాప్తంగా నిలిపివేస్తున్నట్లు రాష్ర్ట కాటన్అసోసియేషన్ అధ్యక్షుడు రవీందర్ రెడ్డి ఆదివారం తెలిపారు. రైతులు గమనించి తమ పంట ఉత్పత్తులను మార్కెట్ కు తీసుకురావద్దని ఏనుమాముల వ్యవసాయ మార్కెట్కార్యదర్శి మల్లేశం పేర్కొన్నారు.
