సీజేఐపై దాడి యత్నాన్ని ఖండిస్తున్నం : కూనంనేని సాంబశివరావు

సీజేఐపై దాడి యత్నాన్ని  ఖండిస్తున్నం : కూనంనేని సాంబశివరావు
  • సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు

హైదరాబాద్, వెలుగు: సుప్రీంకోర్టులో ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ బీఆర్ గవాయ్‌‌‌‌పై ఓ న్యాయవాది బూటుతో దాడికి యత్నించడాన్ని సీపీఐ, సీపీఎం నేతలు ఖండించారు. సీజేఐపై దాడి అత్యంత దిగ్భ్రాంతికరమని, దీన్ని న్యాయ వ్యవస్థపై దాడిగా భావిస్తున్నామని చెప్పారు. 

గవాయ్‌‌‌‌పై జరిగిన దాడి భారత సర్వోన్నత న్యాయ వ్యవస్థ పై దాడిగా భావించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ఓ ప్రకటనలో తెలిపారు. సనాతన ధర్మం పేరుతో కొందరు న్యాయ వ్యవస్థనే బెదిరిస్తున్నారని పేర్కొన్నారు.  అలాగే..సీజేఐ గవాయ్ పై దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్​వెస్లీ కూడా  ఓ ప్రకటనలో పేర్కొన్నారు.