ఇతర కంపెనీల్లో వాటాలు కొంటున్న క్రిప్టో ఎక్స్ఛేంజ్ ఎఫ్​టీఎక్స్​

ఇతర కంపెనీల్లో వాటాలు కొంటున్న క్రిప్టో ఎక్స్ఛేంజ్ ఎఫ్​టీఎక్స్​

న్యూఢిల్లీ: బిజినెస్​ను పెంచడంలో భాగంగా ఇతర కంపెనీల్లో వాటాలు కొనడానికి రెడీగా ఉన్నామని క్రిప్టో ఎక్స్ఛేంజ్ ఎఫ్​టీఎక్స్​ ప్రకటించింది. ఇందుకోసం బిలియన్‌ డాలర్లు ఖర్చు పెట్టేందుకు రెడీగా ఉన్నామని సంస్థ సీఈఓ శామ్​బ్యాంక్​మన్​ ఫ్రైడ్​ ప్రకటించారు. 
ఇందుకోసమే ఇటీవల రెండు బిలియన్ డాలర్లకు పైగా నిధులను సేకరించినట్టు వెల్లడించారు. కంపెనీ లాభాల్లో నడుస్తోందని, ఇతర సంస్థల్లో వాటాలను లేదా కంపెనీలను కొనేందుకు రెడీగా ఉన్నామని వివరించారు. ఎఫ్​టీఎక్స్​ ఈ ఏడాది జనవరిలో 400 మిలియన్ డాలర్లు సేకరించింది. మరో 400 మిలియన్​ డాలర్లూ పెట్టుబడిగా అందాయి.
 

 

ఇవి కూడా చదవండి

2 రోజుల్లో కేరళకు రానున్న రుతుపవనాలు

ఏడాది చివరి నాటికి కొత్త పంబన్ వంతెన పూర్తి

శ్రీలంకలో 50 రోజులుగా కొనసాగుతున్న నిరసనలు

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో భారతీయ డాక్యుమెంటరీకి అవార్డు