2 రోజుల్లో కేరళకు రానున్న రుతుపవనాలు

2 రోజుల్లో కేరళకు రానున్న రుతుపవనాలు
  • ద్రోణి ప్రభావంతో జిల్లాల్లో పడుతున్న వానలు 

దేశ ఆర్థిక వ్యవస్థకు కీలకమైన నైరుతి రుతుపవనాల కోసం ఎదురుచూపులు తప్పడం లేదు. మే 27 నాటికి కేరళ తీరాన్ని తాకుతాయని మొదట భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. మే 27వ తేదీపై వాతావరణశాఖ రెండుసార్లు ప్రకటన చేసింది. అయితే అంచనా వేసినట్లుగా రుతుపవనాలు రాలేదు. తాజాగా చెబుతున్న విషయాల ప్రకారం.. మే 30 జూన్ 2 మధ్య కేరళ తీరాన్ని చేరే అవకాశం ఉందని అంటున్నారు. అరేబియా సముద్రం, లక్షద్వీప్ పరిసర ప్రాంతాల్లో నైరుతి రుతుపవనాల కదలికకు అనుకూల వాతావరణం  ఏర్పడిందని, రెండు మూడు రోజుల్లోనే నైరుతి వస్తుందని ఐఎండీ అంచనా వేసింది. 
సాధారణంగా నైరుతి రుతుపవనాలు కేరళకు జూన్ 1న వస్తుంటాయి. అయితే వాతావరణంలో ఏవైనా అనూహ్య మార్పులు జరిగినా, గాలుల దిశ, ఉపరితల ఆవర్తనాల ఎఫెక్ట్ ఉంటే కాస్త ఆలస్యమవుతుంటాయి. 
అరేబియా సముద్రం నుంచి వస్తున్న గాలులు, ఆవర్తనం ఎఫెక్ట్ తో ఈశాన్య రాష్ట్రాలకు వర్ష సూచన ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. 
అలాగే వచ్చే ఐదు రోజులు కేరళ, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, ఏపీ, పుదుచ్చేరిలోనూ వానలు పడుతాయని ప్రకటించారు. వాతావరణం చల్లబడుతుండడంతో దేశవ్యాప్తంగా హీట్ వేవ్ కండీషన్స్ తగ్గుతాయని వాతావరణ శాఖ తెలిపింది. ప్రస్తుతం కేరళకు ఆనుకుని ఉన్న అరేబియా సముద్రంలో రుతుపవన మేఘాలు ఆవరించాయి. అవి రెండు మూడు రోజుల్లో కేరళ తీరాన్ని తాకుతాయని అంటున్నారు. 

 

ఇవి కూడా చదవండి

ఏడాది చివరి నాటికి కొత్త పంబన్ వంతెన పూర్తి

శ్రీలంకలో 50 రోజులుగా కొనసాగుతున్న నిరసనలు

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో భారతీయ డాక్యుమెంటరీకి అవార్డు