వచ్చే 36 గంటల్లో మరింత తీవ్రం కానున్న బిపార్జోయ్ తుపాను

వచ్చే 36 గంటల్లో మరింత తీవ్రం కానున్న బిపార్జోయ్ తుపాను

వచ్చే 36 గంటల్లో బిపార్జోయ్ తుపాను మరింత తీవ్రం కానుందని, మరో రెండు రోజుల్లో ఉత్తర వాయువ్య దిశగా పయనిస్తుందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ట్వీట్‌లో తెలిపింది. జూన్ 8 రాత్రి 11:30 గంటలకు గోవాకు పశ్చిమ-నైరుతి దిశలో 840 కిలోమీటర్లు, ముంబైకి పశ్చిమ-నైరుతి దిశలో 870 కిలోమీటర్ల దూరంలో ఉన్న తూర్పు-మధ్య అరేబియా సముద్రంపై ఈ తుపాను ప్రభావం చాలా ఉందని చెప్పింది.

సైక్లోన్  బిపార్జోయ్ కారణంగా గాలి వేగం పెరిగే అవకాశం ఉందని, అది జూన్ 10, 11 తేదీల్లో మరింత తీవ్రం కానుందని ఐఎండీ తెలిపింది. జూన్ 08న తూర్పు-మధ్య అరేబియా సముద్రం మీదుగా బైపార్జోయ్.. గోవాకు పశ్చిమ-నైరుతి దిశలో 840 కి.మీ, ముంబైకి పశ్చిమ-నైరుతి దిశలో 870 కి.మీ.ల మీదుగా ప్రయాణించింది. ఈ క్రమంలోనే వచ్చే 36 గంటల్లో మరింత ఈ తుపాను క్రమక్రమంగా మరింత బలపడి వచ్చే 2 రోజుల్లో ఉత్తర-వాయువ్య దిశగా వెళ్లనుందని ట్వీట్ చేసింది. అరేబియా సముద్రంలో తుపాను ప్రభావిత ప్రాంతాల్లోకి మత్స్యకారులు వెళ్లవద్దని వాతావరణ శాఖ ఇప్పటికే సూచించింది. సముద్రంలో ఉన్నవారు తీరానికి తిరిగి రావాలని గతంలోనే తెలిపింది.

https://twitter.com/Indiametdept/status/1666916678712672256