మంత్రి గారూ.. డబుల్ బెడ్రూమ్ ఇవ్వండి

V6 Velugu Posted on Oct 14, 2021

  • భర్త చనిపోవడంతో కుటుంబం రోడ్డునపడిందంటూ కన్నీటితో వేడుకున్న మహిళ

జగిత్యాల జిల్లా: మంత్రి గారూ.. నాకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఇవ్వమంటూ ఓ మహిళ కన్నీటితో వేడుకుంది. తన భర్త అనారోగ్యంతో చనిపోవడంతో పిల్లలతో కలసి తాను రోడ్డునపడ్డానని.. కనీసం ఉండడానికి ఇల్లు ఇవ్వమంటూ ఆమె మంత్రి కొప్పుల ఈశ్వర్ కు తన గోడు చెప్పుకుంది. గురువారం మల్యాల మండలం నూకపెల్లి డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను మంత్రి కొప్పుల ఈశ్వర్ ప్రారంభించారు. చొప్పదండి ఎమ్మెల్యే రవిశంకర్, జడ్పీ చైర్ పర్సన్ దావా వసంత తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. 
కార్యక్రమానికి వచ్చిన పెగడపెల్లి మండలం బతికెపల్లి గ్రామానికి చెందిన లత అనే వివాహత తనకు ఇల్లు కావాలంటూ మంత్రి ఈశ్వర్ కు  ఏడుస్తూ మొర పెట్టుకుంది. తన భర్త శ్రీనివాస్ అనారోగ్యంతో మృతి చెందడంతో కుటుంబం రోడ్డుమీద పడిందంటూ బాధితురాలు విలపించింది.

Tagged jagtial district, opening ceremoney, double bedroom houses, minister koppula eswar, Malyal mandal, Nookapalli village, MLA Ravishankar, widow latha

Latest Videos

Subscribe Now

More News