
హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యాలయం గాంధీ భవన్‌కు వారానికి రెండ్రోజులు మంత్రులు రావా లనే నిర్ణయం బుధవారం నుంచి అమలు కానుంది. వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ రాకతో గాంధీ భవన్‌కు మంత్రుల సందర్శన ప్రోగ్రాం ప్రారంభం కానుంది. గాంధీ భవన్‌లో ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఆయన అందుబాటులో ఉండనున్నారు.
మూడు గంటల పాటు మంత్రి ప్రజలు, పార్టీ కార్య కర్తల నుంచి ఫిర్యాదులను స్వీకరించను న్నారు. ఇక నుంచి ప్రతి బుధ, శుక్రవా రాల్లో గాంధీ భవన్‌లో ఒక్కో మంత్రి అందుబాటులో ఉంటారు. 27న మంత్రి శ్రీధర్‌బాబు, అక్టోబర్ 4న మంత్రి ఉత్తమ్, 9న పొన్నం, 11న సీతక్క, 16న వెంకట్‌రెడ్డి, 18న కొండా సురేఖ, 23న పొంగులేటి, 25న జూపల్లి, 30న తుమ్మల హాజరుకానున్నారు.