కూతుళ్లపై అత్యాచారం కేసులో 15 ఏండ్ల జైలు

కూతుళ్లపై అత్యాచారం కేసులో 15 ఏండ్ల జైలు

శంషాబాద్, వెలుగు: ఇద్దరు కూతుళ్లపై అత్యాచారం కేసులో తండ్రికి 15 ఏండ్ల  జైలు శిక్ష విధిస్తూ ఎల్బీనగర్ కోర్టు తీర్పునిచ్చింది. నేపాల్​కు చెందిన బీకే రాంబహదూర్(45)  కొన్నేళ్లుగా శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలో ఉంటూ ఓ అపార్ట్ మెంట్ లో వాచ్​మన్​గా పని చేసేవాడు. అతడికి ఇద్దరు కూతుళ్లు. 2018 ఆగస్టు 5న రాంబహదూర్ ఇద్దరు కూతుళ్లపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆలస్యంగా ఈ ఘటన వెలుగులోకి రావడంతో శంషాబాద్ ఎయిర్ పోర్టు పోలీసులు రాంబహదూర్​ను అరెస్ట్ చేశారు. బాధితులు మైనర్లు కావడంతో రాంబహదూర్​పై పోక్సో యాక్ట్ కింద కేసు ఫైల్ చేశారు.

మంగళవారం ఈ కేసు విచారణలో భాగంగా ఎల్బీనగర్ కోర్టు రాంబహదూర్​కి 15 ఏండ్ల జైలు, రూ.10 వేల ఫైన్ విధిస్తూ తీర్పునిచ్చింది. బాధితులైన ఇద్దరు అమ్మాయిలకు రూ.6 లక్షల చొప్పున పరిహారం అందించాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది.