మంచిర్యాల జిల్లా శనివారం ఉదయం దట్టమైన పొగమంచు కమ్మేసింది. ఉదయం 9.30 గంటల వరకు కూడా పొగమంచు కారణంగా ఇండ్లు, సింగరేణి బొగ్గు గనులు సరిగా కనిపించలేదు. సింగరేణి కార్మికక్షేత్రాల్లో పొగమంచు తీవ్రత మరీ ఎక్కువగా ఉంది.
ఉదయమే బొగ్గు గనుల్లోకి డ్యూటీలకు వెళ్లే కార్మికులు, వాహనదారులు రోడ్లపై ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించక ఇబ్బంది పడ్డారు. లైట్లు వేసుకొని వెళ్లారు. స్టేడియాలు, మైదానాల్లో వాకింగ్ చేసే వారు పక్కపక్కనే ఉన్నా కనిపించలేదు. - వెలుగు, కోల్బెల్ట్
