పోస్టల్ శాఖ రికార్డు...10 రోజుల్లో కోటి జెండాల విక్రయం

పోస్టల్ శాఖ రికార్డు...10  రోజుల్లో కోటి జెండాల విక్రయం

75వ స్వాతంత్య్ర వేడుకల్లో భాగంగా కేంద్ర సర్కారు హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా ఇంటిపై జాతీయ జెండాను ఎగుర వేయాలని దేశ ప్రజలకు సూచించింది. ఈ నేపథ్యంలో పోస్టల్ శాఖ పది రోజుల్లో కోటి జెండాలను విక్రయించింది. జాతీయ పతాకాల అమ్మకాల్లో ఇదే రికార్డు. పోస్టాఫీసులో ఒక్కో జెండాకు రూ. 25 చొప్పున పోస్ట్లల్ శాఖ అమ్మడం విశేషం. 

దేశ వ్యాప్తంగా 1.5 లక్షల పోస్టాఫీసుల ద్వారా కోటీ త్రివర్ణ పతాకాలను అమ్మినట్లు కేంద్ర కమ్యూనికేషన్ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఇందులో ఆన్ లైన్ ద్వారానే 1.75 లక్షలకు పైగా జెండాలను విక్రయించినట్లు తెలిపింది. దేశ వ్యాప్తంగా ఎక్కడి నుంచైనా త్రివర్ణ పతకాన్ని బుక్ చేసుకుంటే వారికి ఉచితంగా డెలివరీ చేస్తామని తెలిపింది. 

దేశవ్యాప్తంగా 4.2 లక్షల మంది  పోస్టల్ ఉద్యోగులు..ఆయా  నగరాలు, పట్టణాలు, గ్రామాలు, సరిహద్దు ప్రాంతాలు,  జిల్లాలతో పాటు పర్వత గిరిజన ప్రాంతాలలో "హర్ ఘర్ తిరంగ" సందేశాన్ని ప్రచారం చేశారు. ప్రభాత్ ఫేరిస్, బైక్ ర్యాలీతో పాటు..పలు సభల ద్వారా ఇండియా పోస్ట్ సమాజంలోని ప్రతి వర్గానికి "హర్ ఘర్ తిరంగా" సందేశాన్ని తీసుకువెళ్లింది. అంతేకాకుండా సోషల్ మీడియాలోనూ విస్తృతంగా అవగాహన కల్పించింది.