సంపంగి, 6 టీన్స్ వంటి చిత్రాలకు మ్యూజిక్ అందించిన ఘంటాడి కృష్ణ.. స్వీయ సంగీత దర్శక నిర్మాణంలో రూపొందిన చిత్రం 'రిస్క్'. సందీప్ అశ్వ, సన్యా ఠాకూర్ జంటగా నటించారు. జూన్ 26న సినిమా విడుదల కానుంది. ఇటీవల విడు దలైన ట్రైలర్కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ చిత్రంలోని 'దేవుడు. వరమందిస్తే..' పాటను డైరెక్టర్ త్రినాథరావు నక్కిన రిలీజ్ చేసి టీము బెస్ట్ విషెస్ చెప్పాడు.
ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో దర్శకుడు ఘంటాడి కృష్ణ హీరో సందీప్ అశ్వ, నిర్మాతలు రవి సురేష్ రెడ్డి, గుర్ర నర్సింహులు, కోప్రొడ్యూసర్ గడ్డం రవి కుమార్, కోడై క్టర్ బన్సీ కోయల్ కార్ పాల్గొన్నారు. అలాగే 'దేవుడు వరమందిస్తే' పాటకు సంబంధించిన హుక్ స్టెప్తో రీల్స్ లేదా డాన్స్ వీడియోలు చేసి సోషల్ మీడియాలో సినిమా టీమ్ ను ట్యాగ్ చేస్తే బెస్ట్ వీడియోలకు చిత్ర యూనిట్ ప్రత్యేక నగదు బహుమతులు అందజేయనున్నట్లు ప్రకటించింది. ప్రేమ, స్నేహం. యూత్ ఎమోషన్స్, సస్పెన్స్ అంశాలతో తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకులను కచ్చితంగా అలరిస్తుందని దర్శక నిర్మాతలు తెలియజేశారు.
