
ప్రభాస్ శ్రీరాముడి పాత్రలో నటించిన చిత్రం ‘ఆదిపురుష్’. రామాయణం ఆధారంగా ఓం రౌత్ తెరకెక్కించిన ఈ చిత్రం జూన్ 16న విడుదలైంది. మిక్సిడ్ టాక్ వచ్చిన ఈ చిత్రం రెండు రోజుల్లో రూ.240 కోట్లు వసూలు చేసింది. అయితే ఇందులోని కొన్ని డైలాగ్స్ విషయంలో కొంతమంది ప్రేక్షకులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. వారి సూచనల ను పరిగణలోకి తీసుకుంటున్నట్లు తాజాగా చిత్రబృందం ప్రకటించింది. కొద్ది రోజుల్లోనే ఈ మార్పులతో థియేటర్స్‌లో ‘ఆదిపురుష్’ ను చూడవచ్చని టీమ్ తెలిపింది. సీతగా కృతి సనన్, రావణుడిగా సైఫ్ అలీఖాన్ నటించిన ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్‌కు చెందిన వంశీ, ప్రమోద్‌లతో కలిసి టి- సిరీస్, భూషణ్ కుమార్, క్రిషన్ కుమార్, ఓం రౌత్, ప్రసాద్ సుతార్, రెట్రోఫైల్స్ రాజేష్ నాయర్ కలిసి నిర్మించారు.