‘డైమండ్ డెకాయిట్’ ట్రైలర్ విడుదల: ఏప్రిల్ 10న పూర్తి ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకుల ముందుకు

 ‘డైమండ్ డెకాయిట్’ ట్రైలర్ విడుదల: ఏప్రిల్ 10న పూర్తి ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకుల ముందుకు

పార్థ గోపాల్‌‌‌‌ హీరోగా నటిస్తూ, నిర్మిస్తున్న చిత్రం ‘డైమండ్ డెకాయిట్‌‌‌‌’. మేఘన హీరోయిన్‌‌‌‌.  సూర్య జి యాదవ్ దర్శకుడు. ఏప్రిల్ 10న సినిమా విడుదల. శనివారం ఈ మూవీ ట్రైలర్‌‌‌‌‌‌‌‌ను నిర్మాత దిల్ రాజు, ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు రిలీజ్ చేసి టీమ్‌‌‌‌కు ఆల్ ద బెస్ట్ చెప్పారు.   ఈ కార్యక్రమంలో సీనియర్ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ వాకాడ అప్పారావు, నటులు  శివాజీరాజా, థ‌‌‌‌ర్టీ ఇయర్స్  పృథ్వీరాజ్ పాల్గొని  సినిమా సక్సెస్ సాధించాలని  కోరారు.

ఈ సందర్భంగా పార్థ గోపాల్ మాట్లాడుతూ ‘ఇది సస్పెన్స్, ఎమోషన్స్, థ్రిల్ అన్నీ కలిసిన కంప్లీట్ ఎంటర్‌‌‌‌‌‌‌‌టైనర్.  ప్రేక్షకులకు  స‌‌‌‌రికొత్త అనుభూతిని ఇస్తుంది’ అని అన్నాడు. ట్రైలర్‌‌‌‌‌‌‌‌కు పాజిటివ్ రెస్పాన్స్ రావడం ఆనందంగా ఉందని, సినిమా కూడా అందర్నీ అలరిస్తుందని దర్శకుడు సూర్య  చెప్పాడు.