నేరాల నియంత్రణపై ఫోకస్ పెట్టాలి : డీఐజీ చౌహాన్

 నేరాల నియంత్రణపై ఫోకస్ పెట్టాలి : డీఐజీ చౌహాన్
  • డీఐజీ చౌహాన్​

మక్తల్/నర్వ, వెలుగు : నేరాల నియంత్రణపై పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టాలని డీఐజీ చౌహాన్ అన్నారు. మంగళవారం మక్తల్, నర్వ, మాగనూర్​ పోలీస్​స్టేషన్లను ఎస్పీ యోగేశ్ గౌతంతో కలిసి ఆయన సందర్శించి రికార్డులను పరిశీలించారు. పోలీస్ సిబ్బంది విధుల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా డీఐజీ మాట్లాడుతూ పోలీసులు క్రమశిక్షణతో పనిచేస్తూ ప్రజలకు మెరుగైన సేవలు అందించాలన్నారు. గ్రామాల్లోని ప్రజలతో కలిసిమెలిసి ఉంటూ వారి సమస్యలు తెలుసుకోవాలని చెప్పారు. ప్రతి విలేజ్ పోలీస్ ఆఫీసర్ తమకు కేటాయించిన గ్రామంలో విధిగా పర్యటించాలని సూచించారు. పోలీసులు నిబద్ధత, క్రమశిక్షణతో పని చేయాలన్నారు. 

ఆధునిక సాంకేతికతపై పట్టు సాధించాలని చెప్పారు. పోలీస్ స్టేషన్ వచ్చే ఫిర్యాదుదారులతో మర్యాదగా మాట్లాడాలని చెప్పారు. డయల్ 100కు వచ్చిన ఫోన్​కాల్స్​కు వెంటనే స్పందించాలన్నారు. మహిళల భద్రత, రోడ్డు ప్రమాదాల నివారణకు పోలీస్ అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అంతకుముందు డీఐజీకి ఎస్పీ పూల మొక్క అందించి స్వాగతం పలికారు. అనంతరం ఆయా పోలీస్ స్టేషన్లలో మొక్కలు నాటారు. కార్యక్రమంలో డీఎస్పీ లింగయ్య, సీఐలు రాజేందర్ రెడ్డి, రాంలాల్, ఎస్ఐలు రమేశ్, అశోక్ బాబు, భాగ్యలక్ష్మిరెడ్డి, పోలీసు సిబ్బంది 
పాల్గొన్నారు.