KRamp: ‘కె ర్యాంప్’ అంటే బూతు మాట కాదు.. కిరణ్ మీటర్ లోనే కథ రాశా.. నాని కామెంట్స్ వైరల్

KRamp: ‘కె ర్యాంప్’ అంటే బూతు మాట కాదు.. కిరణ్ మీటర్ లోనే కథ రాశా.. నాని కామెంట్స్ వైరల్

కిరణ్ అబ్బవరం, యుక్తి తరేజా జంటగా  జైన్స్ నాని దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘కె -ర్యాంప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌’.  రాజేష్ దండ, శివ బొమ్మకు నిర్మిస్తున్నారు. దీపావళి కానుకగా  అక్టోబర్ 18న సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా శనివారం టీమ్ ప్రెస్ మీట్ నిర్వహించింది.

కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ ‘ఇదొక యూత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫుల్ ఎంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టైనర్. అయినా అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్లు ఎంజాయ్ చేసేలా ఉంటుంది. ముఖ్యంగా పేరెంట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కి కనెక్ట్ అయ్యేలా ఉంటుంది. హీరోయిన్ యుక్తి తరేజా పెర్ఫార్మెన్స్  అందరినీ ఆకట్టుకుంటుంది. ఈ మూవీలో నేను చిల్లరగా ఉంటే.. యుక్తి మ్యాడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గర్ల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫ్రెండ్  క్యారెక్టర్ చేసింది. కుమార్ అనే క్యారెక్టర్ ప్లే చేసేటప్పుడు చాలా ఎంజాయ్ చేశా. నువ్వు నాకు నచ్చావ్, మళ్లీశ్వరి, వెంకీ, రెడీ లాంటి ఎంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టైనర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లా మా కె ర్యాంప్ చిత్రాన్ని కూడా రిపీటెడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా చూస్తారు’ అని చెప్పాడు. కిరణ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో కలిసి నటించడం హ్యాపీగా ఉందని యుక్తి చెప్పింది.

డైరెక్టర్ జైన్స్ నాని మాట్లాడుతూ ‘ఈ సినిమా ఫుల్ ఎనర్జీ, ఎంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టైన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో ఉంటుంది. ‘కె ర్యాంప్’ అంటే బూతు మాట కాదు, కె ర్యాంప్ అంటే కిరణ్ అబ్బవరం ర్యాంప్. అది దృష్టిలో పెట్టుకునే కథ రాశా’ అని అన్నాడు.

నిర్మాత రాజేష్ దండా మాట్లాడుతూ ‘మా సంస్థలో రాబోతోన్న మరో ఎంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టైనర్ ఇది. ఒక బ్రదర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో సినిమా చేసినంత హ్యాపీగా కిరణ్ గారితో మూవీ చేశా. ఆయనతో మళ్లీ మళ్లీ మూవీస్ చేయాలని అనుకుంటున్నా. ఈ దీపావళికి పోటీ ఎంత ఉన్నా మా మూవీ సక్సెస్ మీద పూర్తి కాన్ఫిడెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా ఉన్నాం’ అని అన్నారు. నటుడు వీకే నరేష్​, రచయిత రవి, ప్రొడక్షన్ డిజైనర్ బ్రహ్మ కడలి, మ్యూజిక్ డైరెక్టర్ చేతన్ భరద్వాజ్ పాల్గొన్నారు.