దెబ్బతిన్న పంటలను పరిశీలించిన కలెక్టర్లు

 దెబ్బతిన్న పంటలను పరిశీలించిన కలెక్టర్లు

జనగామ/ రాయపర్తి, వెలుగు: తుఫాన్​ దాటికి నష్టపోయిన పంటలను ఆయా జిల్లాల కలెక్టర్లు పరిశీలించారు. సోమవారం జనగామ కలెక్టర్​ రిజ్వాన్​ భాషా షేక్​ బైక్​పై కొడకండ్ల, పాలకుర్తి మండలాల్లోని పొలాలకువ వెళ్లి పంటలను పరిశీలించారు. 

వరంగల్​ జిల్లా రాయపర్తి మండలం కొండూరు, ఊకల్​ శివారులోని కలెక్టర్​ సత్యశారద దెబ్బతిన్న పంటలు, కాజువేల వద్ద ప్రవహిస్తున్న నీటిని పరిశీలించారు. రైతులు ధైర్యంగా ఉండాలని, అండగా ఉంటామని చెప్పారు.