తమిళనాడు సీఎంగా ఎంకే స్టాలిన్ ప్రమాణ స్వీకారం

తమిళనాడు సీఎంగా ఎంకే స్టాలిన్ ప్రమాణ స్వీకారం

తమిళనాడు 14వ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు డీఎంకే చీఫ్ స్టాలిన్. రాజ్ భవన్ లో జరిగిన కార్యక్రమంలో స్టాలిన్ తో పాటు 33 మంది మంత్రులతో ప్రమాణస్వీకారం చేయించారు గవర్నర్ భన్వరీలాల్ పురోహిత్. కరోనా కారణంగా ప్రమాణ స్వీకార కార్యక్రమం నిరాడంబరంగా జరిగింది. హోం శాఖ, సంక్షేమ, జనరల్ అడ్మినిస్ట్రేషన్ తన దగ్గరే ఉంచుకున్నారు స్టాలిన్. తన మంత్రి వర్గంలో ఇద్దరు మహిళలు, ఇద్దరు మైర్టీలకు స్థానం కల్పించారు. ఇక డీఎంకే సీనియర్ లీడర్, మాజీ మంత్రి, కట్పాడి నుంచి ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన దురై మురుగన్ వాటర్ రీసోర్సెస్ మినిస్టర్ గా ప్రమాణం చేశారు. ఇక కీలకమైన ఫైనాన్స్ మినిస్టర్ గా పళనివేల్ త్యాగరాజన్, ఆరోగ్య శాఖ మంత్రిగా MA సుబ్రమణియన్ ప్రమాణం చేశారు. MRK పన్నీర్ సెల్వం వ్యవసాయం, రైతు సంక్షేమ శాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారంచేశారు. ఫిషరీష్ అండ్ ఫిషర్ ఫోక్ వెల్పేర్ శాఖను అనిత రాధకృష్ణన్ కు కేటాయించారు. 

ఏప్రిల్ 6న తమిళనాడులోని 234 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. మే 2న ఫలితాలు వెలువడ్డాయి. తమిళనాడు అసెంబ్లీలో మేజిక్ ఫిగర్ 118 కాగా...డీఎంకే సొంతంగా 133 స్థానాలు గెలుచుకుంది. మెజార్టీ కన్నా 15 స్థానాలు ఎక్కువ సాధించింది. మొత్తం మీద డీఎంకే కూటమి 159 స్థానాలు గెలుచుకుంది.