మనలో చాలామంది రోజూ ఉతికిన బట్టలు వేసుకోవడానికి చూపిస్తున్న శ్రద్ధను, బూట్లు (షూస్) లేదా చెప్పులను శుభ్రం చేసుకోవడంలో చూపించరు. అవి బాగా దుమ్ముపట్టి, మురికిగా మారేంతవరకు వాటి జోలికి వెళ్లరు. అయితే, వాస్తు, జ్యోతిష్య శాస్త్రాల ప్రకారం.. బూట్లను మురికిగా ఉంచుకోవడం అనేది కేవలం శుభ్రతకు సంబంధించిన విషయం మాత్రమే కాదు, అది మన జీవితం, జాతకం ఇంకా అదృష్టం పై కూడా ప్రభావం చూపిస్తుంది.
వాస్తు శాస్త్రం ఏం చెబుతోంది
మనం రోజంతా చెప్పులు వేసుకుని రకరకాల ప్రదేశాల్లో తిరుగుతుంటాం. కాబట్టి బయట ఉండే దుమ్ము, ధూళితో పాటు నెగెటివ్ ఎనర్జీ కూడా వాటికి అంటుకుంటుంది. అలాంటి మురికి చెప్పులు లేదా బూట్లను అలాగే వదిలేయడం వల్ల, అవి ఇంటి వాతావరణాన్ని పాడు చేయడమే కాకుండా మన ఎదుగుదలను కూడా దెబ్బతీస్తాయి.
మురికి బూట్లకు, శని దేవుడికి ఉన్న లింక్
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, మన పాదాలు ఇంకా పాదరక్షలు శని గ్రహంతో ముడిపడి ఉంటాయి. శని దేవుడికి క్రమశిక్షణ, పరిశుభ్రత అంటే చాలా ఇష్టం. ఎప్పుడైతే మనం మన చెప్పులను, బూట్లను సరిగ్గా పట్టించుకోకుండా మురికిగా ఉంచుతామో, అప్పుడు శని గ్రహ ప్రభావం వల్ల జీవితంలో ఇబ్బందులు ఎదురవుతాయని జ్యోతిష్యులు చెబుతుంటారు. అందుకే బూట్లను క్లీన్‌గా ఉంచుకోవడం చాలా ముఖ్యం.
మురికి బూట్ల వల్ల వచ్చే నష్టాలు
మన చుట్టూ ఉండే ఒక పాజిటివ్ ఎనర్జీని 'ఆరా' (Aura) అంటారు. ఎప్పుడూ మురికిగా, దుర్వాసన వచ్చే బూట్లను వేసుకోవడం వల్ల మనలోని ఆత్మవిశ్వాసం తగ్గిపోతుంది. మానసిక ప్రశాంతత దెబ్బతింటుంది. అదే శుభ్రమైన బూట్లు వేసుకుంటే మనలో తెలియని ఒక పాజిటివ్ ఎనర్జీ, ఉత్సాహం వస్తాయి.
బట్టలు మార్చినప్పుడు.. బూట్లు ఎందుకు మార్చకూడదు
మనం రోజుకో రకం బట్టలు మారుస్తుంటాం కానీ, చాలా రోజుల వరకు ఒకే బూట్లను క్లీన్ చేయకుండా వేసుకుంటుంటాం. బట్టల లాగే బూట్లు కూడా మన వ్యక్తిత్వాన్ని చూపిస్తాయి. వాటిని ఎప్పుడూ మురికిగా ఉంచడం వల్ల ఇంట్లోకి నెగెటివ్ వైబ్స్ వస్తాయి.
పాటించాల్సిన కొన్ని సింపుల్ టిప్స్
*బూట్లను ప్రతిరోజూ తుడవడం లేదా క్లీన్ చేయడం అలవాటు చేసుకోండి.
*చిరిగిపోయిన, విరిగిపోయిన లేదా మరీ పాతదైపోయిన చెప్పులను ఇంట్లో పెట్టుకోకుండా పారేయండి.
*ఇంటి గుమ్మం ముందు లేదా మెయిన్ డోర్ దగ్గర బూట్లను పిచ్చిపిచ్చిగా, కుప్పలుగా పడేయకండి.
*చెప్పులను ఎప్పుడూ ఒక పద్ధతి ప్రకారం షూ రాక్‌లో గానీ, ఒక పక్కన గానీ సర్ది ఉంచండి.
