నెలకు రూ. 900 కడితే... రూ. 3 లక్షలు వస్తాయి

నెలకు రూ.  900 కడితే... రూ. 3 లక్షలు వస్తాయి

ఎల్ఐసీ ఎన్నో రకాల పథకాలు అందిస్తోంది.  అయితే ఎవరికి  నచ్చిన ఎల్ఐసీ స్కీమ్‌ను వారు తీసుకుంటారు. ఎల్ఐసీ పాలసీ తీసుకోవడం వల్ల పలు రకాల ప్రయోజనాలు పొందొచ్చు. రక్షణతో పాటుగా రాబడి కూడా లభిస్తుంది. మీరు ఎంచుకునే పాలసీ ఆధారంగా బెనిఫిట్స్ కూడా మారతాయి. ఎల్ఐసీ అందిస్తున్న పాలసీలలో  ఆధార్ స్తంబ్ పాలసీ  ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఇప్పుడు ఆ పాలసీ గురించి తెలుసుకుందాం. 

అదిరే బెనిఫిట్

ఎల్ఐసీ అందిస్తున్న ఆధార్ స్తంబ్ పాలసీ ద్వారా అదిరే బెనిఫిట్ పొందొచ్చు ఒకేసారి మెచ్యూరిటీ సమయంలో భారీ మొత్తం లభిస్తుంది. ప్రతి నెలా తక్కువ ప్రీమియం చెల్లించొచ్చు.  ఆధార్ స్తంబ్ పాలసీ అనేది నాన్ లింక్డ్ ఇండివిజువల్ లైఫ్ అష్యూరెన్స్ సేవింగ్స్ ప్లాన్. దీని ద్వారా సేవింగ్స్, ప్రొటెక్షన్ రెండూ లభిస్తాయి. తక్కువ ప్రీమియంతో పాలసీ కొనుగోలు చేయాలని భావించే వారు ఉంటే ఈ ప్లాన్ ఎంచుకోవచ్చు.

తక్కువ ప్రీమియం.. ఎక్కువ లాభం...

ఆధార్ స్తంబ్ పాలసీ తీసుకోవాలనుకొనే వారికి కనీసం 8 ఏళ్లు ఉండాలి. గరిష్టంగా 55 ఏళ్ల వరకు వయసు ఉన్న వారు కూడా పాలసీ తీసుకోవచ్చు. ఈ పాలసీ తీసుకోవడం వల్ల లోన్ ఫెసిలిటీ కూడా పొందొచ్చు. మెచ్యూరిటీ సమయంలో ఒకేసారి పాలసీ మొత్తాన్ని చెల్లిస్తారు. కనీసం రూ. 75 వేలకు పాలసీ తీసుకోవచ్చు. అలాగే గరిష్టంగా రూ. 3 లక్షల వరకు బీమా మొత్తానికి పాలసీ తీసుకోవచ్చు. మీరు ఎంచుకునే బీమా మొత్తం ఆధారంగా మీకు వచ్చే రాబడి మారుతుంది. ఈ పాలసీ తీసుకున్న వారికి లోన్ ఫెసిలిటీ లభిస్తుంది. మూడేళ్లు అయిన తర్వాత పాలసీ మీద లోన్ తీసుకోవచ్చు. మెచ్యూరిటీ సమయంలో బీమా మొత్తం, లాయల్టీ బోనస్ వంటివి లభిస్తాయి. ఒకేసారి భారీ మొత్తం పొందొచ్చు.

ఎలాంటి బెనిఫిట్స్ అంటే.. 

ఏడాదికి రూ. 10 వేలు కడితే.. 20 ఏళ్ల టెన్యూర్ ఎంచుకుంటే మీకు మెచ్యూరిటీ సమయంలో రూ. 3 లక్షలు లభిస్తాయి. ఏడాదికి రూ. 10 వేలు ప్రీమియం అంటే.. నెలకు దాదాపు రూ. 900 పడుతుంది. నెలకు కూడా ప్రీమియం చెల్లించొచ్చు. లేదంటే మూడు నెలల ప్రీమియం ఆప్షన్ ఎంచుకుంటే.. రూ. 2700 కట్టాల్సి ఉంటుంది. అదే ఆరు నెలల టెన్యూర్ అయితే రూ. 5 వేల వరకు చెల్లించాల్సి వస్తుంది. ఎల్ఐసీ మాత్రమే కాదు.. ఏ కంపెనీ నుంచి అయినా పాలసీ తీసుకునే ముందు అన్ని విషయాలు పూర్తిగా తెలుసుకోవడం ఉత్తమం. అప్పుడే ఎలాంటి ఇబ్బంది ఉండదు. లేదంటే మాత్రం మెచ్యూరిటీ సమయంలో సమస్యలు రావొచ్చు.