
పాల్వంచ, వెలుగు : రాష్ట్ర మంత్రి గా ప్రమాణ స్వీకారం చేసిన పెద్ద పల్లి ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామికి పాల్వంచ కేటీపీఎస్ కు చెందిన మాల విద్యుత్ ఉద్యో గుల సంఘం జాతీయ అధ్యక్షుడు బూర్గుల విజయ భాస్కర్ రావు (బాచి), జిల్లా అధ్యక్షుడు తుప్పుడు శివకుమార్ ఆధ్వర్యంలో ఆదివారం శుభాకాంక్షలు తెలిపారు. ఆయనను విజయభాస్కర్ గజ మాలతో సన్మానించి పుష్పగుచ్ఛం అందజేశారు. ఈ కార్యక్రమంలో జాతీయ మాల మహానాడు అధ్యక్షుడు జి చెన్నయ్య, నాయకులు బూర్గుల వెంకటే శ్వర్లు, చైతన్య తదితరులు పాల్గొని విషెష్ తెలిపారు.
అశ్వారావుపేట : కాంగ్రెస్ పార్టీ మాలలకు అండగా ఉంటుందని మంత్రివర్గంలో చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామికి చోటు కనిపించటమే అందుకు నిదర్శనమని అశ్వారావుపేట నియోజకవర్గ మాల మహానాడు కన్వీనర్ అల్లాడి వెంకట రామారావు ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పార్టీ బలోపేతం చేసేందుకు తమ వంతు సహకారాన్ని అందిస్తామని తమ కులాన్ని గుర్తించి వివేక్ వెంకటస్వామి కి మంత్రి పదవి ఇవ్వడం పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదములు తెలిపారు.