ఆధార్ సమస్యలకు చెక్.. వచ్చేస్తోంది కొత్త యాప్‌.. ఇప్పుడు అరచేతిలోనే అన్ని..

ఆధార్ సమస్యలకు చెక్.. వచ్చేస్తోంది కొత్త యాప్‌.. ఇప్పుడు అరచేతిలోనే అన్ని..

భారత ప్రభుత్వం ఆధార్ వినియోగదారుల కోసం ఒక మొబైల్ యాప్  తీసుకొస్తుంది. ఈ మొబైల్ యాప్ భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ అభివృద్ధి చేస్తోంది.  ఈ యాప్ వచ్చాక ఆధార్ సర్వీస్ సెంటరుకి వెళ్లాల్సిన పని లేకుండా జస్ట్ యాప్‌ ఉపయోగించి మీ వివరాలు అంటే పేరు, అడ్రస్, పుట్టిన తేదీ ఇతర సమాచారం అప్ డేట్ చేసుకోవచ్చు. ఈ మొబైల్ యాప్ ఈ ఏడాది చివరి నాటికి వచ్చే అవకాశం ఉంది.

ఈ-ఆధార్ అంటే ఏమిటి: ఈ-ఆధార్ అంటే  మీ పేరు, ఇంటి అడ్రస్, పుట్టిన తేదీ వంటి సమాచారం లేదా వ్యక్తిగత వివరాలను మీ స్మార్ట్‌ఫోన్‌ నుండే అప్‌డేట్ చేసుకోవచ్చు, అది కూడా ఈ కొత్త ఆధార్ మొబైల్ యాప్ ద్వారా. ఈ యాప్ ముఖ్య ఉద్దేశం ఆధార్ లో మీ వివరాలను సరిచేయడం,  వివరాలను అప్ డేట్ చేయడం, ఆధార్ సెంటర్ల వద్ద రద్దీ తగ్గించడానికి... ఫేస్ ఐడి టెక్నాలజీతో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ద్వారా ఈ యాప్ భారతదేశం అంతటా సురక్షితమైన డిజిటల్ ఆధార్ సేవలను అందిస్తుంది.

ఈ నవంబర్ నుండి ఆధార్ వినియోగదారులు ఫింగర్ ప్రింట్, ఐరిస్ స్కానింగ్‌తో సహా బయోమెట్రిక్ అతేంటికేషన్ కోసం  మాత్రమే ఆధార్ సెంటరుకు  వెళ్లాలి. UIDAI తీసుకుంటున్న  ఈ కొత్త చర్యతో పేపర్ పని లేకుండా గుర్తింపు మోసాలు, ప్రమాదాలను తగ్గింనుంది. 

ఈ యాప్ ఏ డాకుమెంట్స్ కి సపోర్ట్ చేస్తుందంటే : ఈ ఫీచర్లతో పాటు UIDAI ప్రభుత్వ వెబ్‌సైట్స్ నుండి వివరాలు పొందేందుకు కూడా ప్లాన్ చేస్తుంది. దీనివల్ల బర్త్ సర్టిఫికెట్లు, పాన్ కార్డులు, పాస్‌పోర్టులు, డ్రైవింగ్ లైసెన్సులు, రేషన్ కార్డులు, MNREGA రికార్డ్స్ నుండి డాకుమెంట్స్ ఆటోమేటిక్‌గా అందుబాటులోకి వస్తాయి. అంతేకాకుండా అడ్రస్ వెరిఫికేషన్ కోసం కరెంట్ బిల్లు వివరాలను కూడా పొందొచ్చు.

ఆధార్ పోర్టల్ గురించి: ఆధార్ గుడ్ గవర్నెన్స్ పోర్టల్‌  ఎలక్ట్రానిక్స్ & ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ (MeitY) ప్రారంభించింది. ఈ పోర్టల్ ఆధార్ వెరిఫికేషన్, ఆధార్ సేవలను మరింత వేగంగా, సులభంగా చేస్తుంది.