
- రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి
గచ్చిబౌలి, వెలుగు: ఆహార భద్రత, ఆర్థిక లోటు లేకుండా దేశం అభివృద్ధి దిశగా పరుగులు పెట్టాలంటే ఆర్థిక నిపుణుల సేవలు కీలకమని రాష్ట్ర రైతు కమిషన్చైర్మన్కోదండరెడ్డి అన్నారు. ప్రపంచంలో భారత్ ఆర్థికంగా పెద్దదేశంగా నిలబడడానికి గణాంక శాస్త్రవేత్త సీఆర్ రావు ఎంతగానో కృషి చేశారని కొనియాడారు. గచ్చిబౌలి హెచ్ సీయూలోని రామానుజన్ బిల్డింగ్ ఆడిటోరియంలో సోమవారం నేషనల్ స్టాటిస్టిక్స్ డే వేడుకలు నిర్వహించారు.
ముఖ్య అతిథిగా కోదండరెడ్డి హాజరై మాట్లాడారు. అప్పటి ప్రధాని పండిట్ నెహ్రూకు సీఆర్ రావు సలహాలిచ్చి దేశాన్ని ప్రణాళికాబద్ధంగా ముందుకు తీసుకెళ్లారన్నారు. పీవీ హయాంలో మన్మోహన్ సింగ్ ఆర్థిక సంస్కరణలతో దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టారని గుర్తుచేశారు. ఇందిరా గాంధీ తీసుకొచ్చిన భూ సంస్కరణలు అభివృద్ధికి మరింత దోహదపడ్డాయన్నారు.