ఎల్​ అండ్​ టీ ఇన్‌‌‌‌ఫ్రాను కొన్న ఎడెల్‌‌‌‌వీస్​

ఎల్​ అండ్​ టీ ఇన్‌‌‌‌ఫ్రాను కొన్న ఎడెల్‌‌‌‌వీస్​
  • డీల్​ విలువ రూ.ఆరు వేల కోట్లు

ముంబై: వివిధ రోడ్డు ఆస్తులు, పవర్​ ట్రాన్స్​మిషన్​ లైన్స్​ ఉన్న ఎల్‌‌‌‌ అండ్‌‌‌‌ టీ ఇన్‌‌‌‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌‌‌‌మెంట్ ప్రాజెక్ట్‌‌‌‌లను (ఎల్‌‌‌‌టీఐడీపీఎల్) కొనుగోలు చేయడానికి రూ. ఆరు వేల కోట్ల డీల్‌‌‌‌ను పూర్తి చేసినట్లు ఎడెల్‌‌‌‌వీస్ ఆల్టర్నేటివ్స్ గురువారం ప్రకటించింది.  ఈ కంపెనీలో ఎల్​అండ్​టీకి 51 శాతం వాటా, కెనడా పెన్షన్ ప్లాన్ ఇన్వెస్ట్‌‌‌‌మెంట్ బోర్డ్​కు మిగిలిన వాటా ఉంది. ఈ జాయింట్ వెంచర్  కొనుగోలు ఒప్పందాన్ని డిసెంబర్ 2022లోనే ప్రకటించారు. 

ఈ జేవీలో ఎడెల్‌‌‌‌వీస్ 100 శాతం యాజమాన్యాన్ని కొనుగోలు చేస్తోంది. ఈ సంస్థకు  4,400 లేన్ కిలోమీటర్లు,  960 సర్క్యూట్ కిమీ పవర్ ట్రాన్స్‌‌‌‌మిషన్ లైన్‌‌‌‌తో పాటు ఏడు రోడ్డు ఆస్తులతో కూడిన పోర్ట్‌‌‌‌ఫోలియో ఉంది. ఈ కొనుగోలు తర్వాత, ఇన్‌‌‌‌ఫ్రా ప్లాట్‌‌‌‌ఫాం  మొత్తం పోర్ట్‌‌‌‌ఫోలియో 26 ఆస్తులకు పెరుగుతుంది. ఇందులో ఐదు వేల లేన్ -కిమీ రోడ్లు, 1,800 సీకేఎంఎస్​ పవర్ ట్రాన్స్‌‌‌‌మిషన్ ఆస్తులు,  813 ఎండబ్ల్యూపీ పునరుత్పాదక ఆస్తులు, రూ. 3వేల కోట్ల సంచిత వార్షిక ఆదాయం ఉంటాయి.