- నేరాల కట్టడికి కృషి చేయాలని హితవు
పారిస్: గ్రే లిస్ట్ (నిషేధిత జాబితా) నుంచి బయటపడినంత మాత్రాన టెర్రర్ కార్యకలాపాలకు ఫండింగ్ చేయడానికి అనుమతి దొరికినట్లు భావించకూడదని పాకిస్తాన్‌ను ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ (ఎఫ్ఏటీఎఫ్) హెచ్చరించింది. గ్రే లిస్ట్ నుంచి ఎగ్జిట్ అయినప్పటికీ ఉగ్రవాద కార్యకలాపాలు, నేరాల కట్టడికి కృషి చేయాలని హితవు పలికింది.
ఎఫ్ఏటీఎఫ్ ప్రెసిడెంట్ ఎలీసా డి ఆండా మద్రాజో శనివారం పారిస్‌లో మీడియా సమావేశంలో మాట్లాడారు. పాక్ సహా అన్ని దేశాలు నేరాల కట్టడికి చర్యలు తీసుకోవాలని ఆమె సూచించారు. ‘‘గ్రే లిస్ట్‌లో ఉన్నా లేకపోయినా ఏ దేశమైనా క్రిమినల్స్, టెర్రరిస్టులకు ఫండింగ్ చేయరాదు. మనీ లాండరింగ్‌కు పాల్పడరాదు.
గ్రే లిస్ట్ నుంచి డీలిస్ట్ అయిన దేశాలకు కూడా మేము ఇదే సూచిస్తున్నాం” అని ఎలీసా పేర్కొన్నారు. కాగా.. 2022 అక్టోబరులో గ్రే లిస్ట్ నుంచి పాకిస్తాన్ ను ఎఫ్ఏటీఎఫ్ తొలగించింది. అయినప్పటికీ పాక్ ను ఎప్పటికపుడు ఫాలో అప్ చేస్తూ ఉగ్రవాద కార్యకలాపాల కట్టడికి చర్యలు తీసుకుంది. అయితే, పాక్.. ఎఫ్ఏటీఎఫ్ మెంబర్ కాదు. ఈ నేపథ్యంలో ఏషియా పసిఫిక్ గ్రూప్(ఏపీజీ).. ఎఫ్ఏటీఎఫ్ తరపున పాక్ ను ఫాలో అప్ చేసింది. ఉగ్రవాద కార్యకలాపాలకు ఫండింగ్ చేస్తున్న, మనీ లాండరింగ్‌కు పాల్పడుతున్న దేశాలను ఎఫ్ఏటీఎఫ్ గ్రే లిస్ట్ లో చేర్చింది.
