
సోంఫుని మౌత్ ప్రెష్నర్ గానే ఎక్కువగా వాడుతుంటాం. కానీ సోంఫులో చర్మం, జుట్టు అందాన్ని పెంచే గుణాలు కూడా ఉన్నాయి. సోంఫు గింజలను నానబెట్టిన నీళ్లతో ముఖం కడుక్కుంటే మలినాలు పోతాయి. వీటిలోని యాంటీ–సెప్టిక్ గుణాలు యాక్నేకు మందుగా పనిచేస్తాయి. వీటిలోని విటమిన్–సి, పొటాషియం, మెగ్నీషియం, ఫొలేట్, ఐరన్ వంటివి స్కిన్, హెయిర్ ఆరోగ్యానికి ఎంతో అవసరం. వీటిలోని యాంటీ–ఆక్సిడెంట్లు చర్మం ముడతలకు కారణమయ్యే ఫ్రీ రాడికల్స్‌ని తొలగిస్తాయి. పేస్ట్ కూలింగ్ ఏజెంట్లా పనికొస్తుంది. పేస్టుని కళ్ల చుట్టూ రాసుకొని పది నిమిషాల తర్వాత శుభ్రం చేసుకోవాలి. ఇలా చేస్తే కళ్ల అలసట తగ్గుతుంది. ఒక చిన్న గిన్నెలో నీళ్లు, వేసి మరిగించాలి. ఆ నీళ్లతో శుభ్రం చేసుకుంటే జుట్టు తొందరగా రంగు మారదు.